
Aug 10 2026 6:56 PM | Updated on Aug 10 2026 7:04 PM
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఎస్పీ కీలక నిర్ణయం తీసుకున్నారు. విధులలో నిర్లక్షం వహించినందుకు 18 మంది స్టేషన్ ఇంఛార్జ్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. నిర్ణీత 60, 90 రోజుల గడువులో ఛార్జ్షీట్లను కోర్టులో దాఖలు చేయకపోవడం, ఈ-సాక్ష్యాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, ఎఫ్ఐఆర్, ఛార్జ్‌షీట్ వివరాలను సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేయడంలో నిర్లక్ష్యం చేసిన 18 మంది పోలీస్ స్టేషన్ఇంఛార్జ్లకు "విధుల్లో నిర్లక్ష్యం చేశారు. దీనినిఅధికారికంగా పరిగణిస్తున్నాం ఇకపై మళ్లీ ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరికలు జారీ చేశారు.
పోలీసింగ్ అంటే కేవలం కేసు నమోదు చేయడం, నిందితులను అరెస్ట్ చేయడం మాత్రమే కాదని.. దర్యాప్తులో సాక్ష్యాల నాణ్యత, సాంకేతిక ప్రక్రియలు, నిర్ణీత గడువులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం కూడా కీలకమని ఎస్ఎస్పీ స్పష్టం చేశారు. ఈ-సాక్ష్యాల తయారీలో నిర్లక్ష్యంపై పలువురు అధికారులను మరోసారి హెచ్చరించారు. ఇకపై పోలీసు అధికారుల పనితీరును కేవలం అరెస్టులు, కేసుల సంఖ్య ఆధారంగా కాకుండా.. దర్యాప్తు నాణ్యత, సాక్ష్యాల నిర్వహణ, ఈ-సాక్ష్యాల నమోదు, కోర్టులో కేసుల పురోగతి వంటి అంశాల ఆధారంగా కూడా అంచనా వేస్తామని ఎస్ఎస్పీ తెలిపారు.
మరోవైపు మెరుగైన పనితీరు కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని కూడా ఎస్ఎస్పీ ప్రోత్సహించారు. నిర్ణీత గడువులో ఛార్జ్షీట్లు దాఖలు చేయడం, ఈ-సాక్ష్యాలను సమర్థంగా సిద్ధం చేయడం వంటి పనుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన పలువురి పేర్లను వారి సర్వీస్ రికార్డుల్లో ప్రశంసగా నమోదు చేశారు. ఈ-సాక్ష్యాలు, ఎస్ఐజీడీ జనరేషన్, వాటిని కేసులతో అనుసంధానం చేయడంలో మెరుగైన పనితీరు కనబరిచిన 10 మంది పోలీసు సిబ్బందికి నగదు బహుమతి అందించారు. నిర్లక్ష్యంపై హెచ్చరికలు.. మంచి పనికి ప్రశంసలు, నగదు బహుమతులు ఇవ్వడం ద్వారా పోలీసు దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు)
హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఘటనపై అనితకు ఇచ్చిపడేసిన తెలంగాణ ప్రజలు
ప్రియాంక ఘటనపై జూపల్లి కృష్ణ రావు సంచలన వ్యాఖ్యలు
నీకు దమ్ముంటే నీ కొడుకుని రాజీనామా చేయమని చెప్పు
మా జగనన్న సీఎం అయ్యాక.. ఫస్ట్ ఓపెన్ చేసేది DSCఫైలే.. పేర్ని కిట్టు వార్నింగ్





