
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. KS Bharat Retirement News: తెలుగు క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారత వికెట్ కీపర్-బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ (కేఎస్ భరత్) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం 32 ఏళ్ల వయసులోనే ఆయన అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ ద్వారా వెల్లడించారు. దీంతో టీమిండియా తరఫున టెస్ట్ ఫార్మాట్లో ప్రాతినిధ్యం వహించిన ఒక తెలుగు ఆటగాడి అంతర్జాతీయ ప్రస్థానానికి ముగింపు పడింది. భావోద్వేగానికి గురైన కేఎస్ భరత్: తన రిటైర్మెంట్ నోట్లో భరతదేశం తరఫున ఆడటాన్ని అత్యున్నత గౌరవంగా భావిస్తూ ఇలా రాసుకొచ్చారు. "గర్వంతో, కృతజ్ఞతా భావంతో నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి విరమించుకుంటున్నట్లు ప్రకటిస్తున్నాను. నా దేశం కోసం ఆడటం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవం. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, టెస్టుల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ప్రతి క్షణానికీ తగిన గౌరవాన్ని ఇచ్చింది. నా కలను సాకారం చేయడానికి అండగా నిలిచిన నా కుటుంబానికి, బీసీసీఐ, కోచ్‌లకు, సహచర ఆటగాళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని కేఎస్ భరత్ రాసుకొచ్చాడు. కోహ్లీ, రోహిత్, ద్రవిడ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు.. తన కెరీర్లో అత్యంత కీలక పాత్ర పోషించిన ముగ్గురు దిగ్గజాలకు భరత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడే అవకాశం ఇచ్చి, తన నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేలా చేసినందుకు ఆర్సీబీ అప్పటి కెప్టెన్
విరాట్ కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసే అమూల్యమైన అవకాశం దక్కిందని భరత్ గుర్తుచేసుకున్నారు.
అదే విధంగా రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా పనిచేసిన ఇండియా 'ఎ' జట్టు నుండి జాతీయ జట్టు వరకు ఆయన అందించిన గైడెన్స్, సపోర్ట్ వల్లే తాను టెస్టు క్రికెటర్‌గా ఎదగలిగానని కేఎస్ భరత్ కొనియాడారు.
కేఎస్ భరత్ క్రికెట్ ప్రస్థానం ఫిబ్రవరి 2023లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన భరత్.. ఫిబ్రవరి 2024లో విశాఖపట్నంలో ఇంగ్లాండ్‌తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. అంతర్జాతీయ కెరీర్ స్వల్పంగానే సాగినప్పటికీ, దేశవాళీ క్రికెట్లో ఆయన ఒక దిగ్గజంగా నిలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.