టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ .. ప్రస్తుతం టెస్ట్, టీ20లకు గుడ్‌బై చెప్పి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆడటమే లక్ష్యంగా వీరిద్దరూ అడుగులు వేస్తున్నారు. ఇక స్వదేశంలో జూన్ 13 నుంచి అఫ్ఘానిస్థాన్‌తో భారత్ వన్డే సిరీస్‌లో ఆడనుంది. మొత్తంగా మూడు వన్డే మ్యాచ్‌లు ఈ సిరీస్‌లో జరుగుతాయి. ఇందుకోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ రోహిత్, కోహ్లీలు ఈ సిరీస్‌లో ఆడేది అనుమానంగా మారింది.ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగనుంది. శుభమన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఈ సిరీస్‌లో తలపడనుంది. అయితే గాయాల కారణంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. వన్డే సిరీస్‌కు దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. రోహిత్ దూరమయ్యాడని.. కోహ్లీ ఆడతాడా లేడా అనేది తేలాల్సి ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే ఈ విషయంపై అప్డేట్ ఇచ్చాడు.“బయట ఎలాంటి చర్చ జరిగినా అనవసరం. అధికారికంగా మేం త్వరలోనే సమాచారం ఇస్తాం. విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ వంటి పెద్ద ఆటగాళ్లు సిరీస్‌లో ఆడకపోవడం బిగ్ న్యూస్ అవుతుందని తెలుసు. ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రోటోకాల్స్ అందరికీ ఒకేలా ఉంటాయి. సిరీస్ ప్రారంభానికి ఇంకొంత సమయం ఉంది. ఆలోగా మేం నిర్ణయం తీసుకుంటాం. ఫిట్‌గా ఉంటే తుది జట్టులో ఉంటారు. లేకపోతే అందుకు తగినట్టుగా మార్పులు చేసుకుంటాం. వైద్య బృందం నిర్ణయం తర్వాత.. ఆయా ఆటగాళ్ల పరిస్థితిపై అధికారికంగా స్పందిస్తాం” అని టెన్ డస్కటే చెప్పాడు.భారత్- అప్ఘానిస్థాన్ వన్డే సిరీస్ షెడ్యూల్తొలి వన్డే : జూన్ 13 (ధర్మశాల)రెండో వన్డే : జూన్ 17 (లక్నో)మూడో వన్డే : జూన్ 20 (చెన్నై)వన్డే సిరీస్ కోసం భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,
శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గూర్నూర్ బ్రార్, హర్ష్ దూబె.