
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా, రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో ఇప్పటికే మొదటి వారంలో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండో వారం కూడా దాదాపు 11 మంది నామినేషన్స్ లో ఉన్నారు. దీంతో ఈవారం ఎవరు హౌస్ నుంచి బయటకు రాబోతున్నారనే విషయంపై ఉత్కంఠ రేపుతోంది. కాగా ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ క్యాటగిరీలో కొంతమంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ సీజన్ 2 ద్వారా కామనర్స్ ను ఎంపిక చేసి హౌస్ లోకి ఆరుగురు కంటెస్టెంట్లను పంపించారు. ఇలా కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన వారిలో రైతు బిడ్డ కమ్ సింగర్ ఝాన్సీ ఒకరు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆమె తన తండ్రికి చేదోడువాదోడుగా పొలం పనులుచేస్తూనే మరోవైపు ఉన్నత చదువులు చదువుతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లోకి అడుగు పెట్టిన ఆమె తన ట్యాలెంట్ తో బిగ్ బాస్ టికెట్ అందుకొని హౌస్ లోకి ఎంటర్ ఇచ్చింది. అయితే హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఝాన్సీ ఆట తీరు పూర్తిగా మారిపోయిందని, చాలా సెల్ఫీష్ గా గేమ్ ఆడుతోందని, కట్టప్ప కంటే దారుణంగా వెన్నుపోటు పొడుస్తుంది అంటూ ఈ రైతు బిడ్డపై విమర్శలు కురిపిస్తున్నారు. ఝాన్సీ రైతు బిడ్డ పేరుతో డ్రామా నడిపిస్తోందని, ఆమెను చూస్తుంటే పల్లవి ప్రశాంత్ గుర్తుకొస్తున్నాడంటూ నెటిజన్లు ఈ రైతుబిడ్డపై ట్రోల్స్ చేస్తున్నారు





