
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Upasana Konidela at Peddi Movie Premier Video: పెద్ది సినిమా.. పేరు లేని ఒక ఆటగాడు పెద్దిగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథ. ఇందులో రామ్ చరణ్ బాడీ బిల్డింగ్, క్రికెట్, కుస్తీ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కోసం రాంచరణ్ అభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. పెద్ది ప్రీమియర్స్ రాత్రి నుంచే సందడిగా సాగుతున్నాయి. హైదరాబాద్ బాలానగర్ విమల్ థియేటర్లో ఉపాసన ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేస్తూ, రాంచరణ్ కనిపించగానే పేపర్లు విసిరి ఉత్సాహంగా గడిపారు. ఇప్పటికే థియేటర్లన్నీ కోలాహలంగా మారాయి, విజిల్స్, కేరింతలతో అభిమానులు సందడి చేస్తున్నారు. ఉపాసనతోపాటు ఆమె ఫ్యామిలీ కూడా వచ్చింది. తనతోపాటు ఆమె తండ్రి అనిల్ కామినేని కూడా ఉన్నారు.
పెద్ది ప్రీమియర్స్ లో ఉపాసన పాల్గొనడం ఇప్పుడు వైరల్ అవుతోంది. అభిమానుల కేరింతల మధ్య ఉపాసన కూడా నవ్వుతూ సంబరాల్లో పాలుపంచుకున్నారు. థియేటర్ అంతా పేపర్ ముక్కలతో నిండిపోయి, గాలిలో ఎగరేస్తూ వాతావరణం భలేగా ఉంది. ఈ పెద్ది సినిమా సంబరాలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు.. బెంగళూరులోని బృందా థియేటర్లో కూడా ఇలాంటి సందడే కనిపించింది. అక్కడ ప్రత్యేక ప్రివ్యూ కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. షో సందర్భంగా థియేటర్ బయట అభిమానులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సినిమాలో నటించిన శివరాజ్ కుమార్ కూడా ప్రీమియర్స్ వీక్షించిన వీడియో కూడా వైరల్ అవుతోంది..
#peddi premier show@upasanakonidela cheers and enjoyed the Mr C @AlwaysRamCharan entry scenes in peddi pic.twitter.com/KQiboh1CkU
— Rajababu Anumula (@Rajababu_a) June 3, 2026
రివ్యూ ఇలా.. ఇక పెద్ది సినిమాలో పాటలు కూడా అదిరిపోయాయి. జగపతిబాబు, శివరాజ్ కుమార్ పాత్రలు ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.. అయితే జాన్వీ కపూర్ పాత్ర, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం సాగదీతగా ఉన్నాయని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుండి ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, ఉపాసనతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమాను వీక్షించారు. పెద్ది కోసం గ్రాండ్ సెలబ్రిటీ షోను ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
మొత్తానికి పెద్ది అనేది క్రికెట్, రెజ్లింగ్ వంటి క్రీడలను కలగలిపి తీసిన ఒక స్పోర్ట్స్ డ్రామా, ఇది కథానాయకుడికి ఒక కీలకమైన పోరాటంగా మారనుంది. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. సతీష్ కిలారు , ఈశాన్ సక్సేనా ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు థియేటర్ల నుండి వస్తున్న వీడియోలు అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook