
APSPDCL CMD Shivashankar: ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వకూడదని ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులు, సిబ్బందికి సూచించారు. పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి బుధవారం వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ సమస్యల పరిష్కారానికై ప్రతినెలా మొదటి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏపీఎస్పీడీసీఎల్ అవకాశం కల్పిస్తోంది. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి జరిగిన ఈ కార్యక్రమం ద్వారా సంస్థ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి 10 మంది పారిశ్రామిక వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలపై చర్చిస్తూ, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయాలని కోరారు. Read also: Chittoor Ganja Case:తిరుపతి-బెంగళూరు హైవేపై భారీగా దొరికిన గంజాయి.. ఒడిశా కేటుగాళ్ల అరెస్ట్! ఈ సందర్భంగా సీఎండి శివశంకర్ లోతేటి మాట్లాడుతూ పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఏపీఎస్పీడీసీఎల్ కృషి చేస్తోందని తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో సబ్-స్టేషన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. పారిశ్రామిక విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సంస్థ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. చిత్తూరు సమీపంలోని గండ్రాజుపల్లి పారిశ్రామికవాడ నుంచి అల్లూరయ్య మాట్లాడుతూ తమకు దగ్గరలో సబ్-స్టేషన్ లేకపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తెలియజేయగా ఈ అంశంపై సీఎండి స్పందిస్తూ గండ్రాజుపల్లె పారిశ్రామికవాడకు ప్రత్యేకంగా సబ్-స్టేషన్ ను మంజూరు చేశామని, నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (టెక్నికల్ & హెచ్ఆర్ డి) కే. గురవయ్య, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఐటి) పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్/ఫైనాన్స్ (ఎఫ్ఎసి) కే. రామమోహన్ రావు, చీఫ్
జనరల్ మేనేజర్లు యం. ఉమాపతి, ఎం. మురళి కుమార్, కే. సంపత్ కుమార్, ఎస్. రమణ, జనరల్ మేనేజర్లు చక్రపాణి, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
Chandrababu Naidu: పవన్ పై విమర్శలు ఆపండి.. తెలంగాణ నాయకులపై చంద్రబాబు ఫైర్!
SV Oriental College Admissions: ఎస్వీ ప్రాచ్య కళాశాలలో 2026 అడ్మిషన్లు ప్రారంభం.. నేడే దరఖాస్తు చేసుకోండి!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Telangana: తెలంగాణ మా అయ్యల జాగీరు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్
Andhra Pradesh Rains: రానున్న ఐదు రోజులు ఏపీకి వర్ష సూచన
Vangalapudi Anita: డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు: హోంమంత్రి అనిత
Nara Lokesh: విశాఖ-కాకినాడ తీరంలో కెమికల్ ప్లాంట్ ఏర్పాటు.. రష్యా దిగ్గజానికి లోకేష్ ఆహ్వానం
ప్రకాశం జిల్లా ఒంగోలు శివార్లలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం, ఊహించని విధంగా భారీ ఎత్తున...
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసులో...
ఎల్‌నినో ఎఫెక్ట్ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ...
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలకు సిద్ధమైందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో...
జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవుతోంది. ఈ కాలం జూన్ 22 వరకు...
మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాల్లో గత ఆదివారం నుండి రుతుపవన పూర్వ (Pre-Monsoon)...
తెలంగాణ రాజకీయాల్లో కాంట్రాక్టులు, ప్రాంతీయ అంశాలపై సరికొత్త వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లకు తెలంగాణలో...
హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. నగరంలోని ఐటీ హబ్ ఐకాన్...
హైదరాబాద్‌లో జనసేన అంతర్గత సభకు అనుమతి నిరాకరణ, ఆపై హైకోర్టులోనూ హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణకు...
ముదివర్తిపాలెంలో ఘోరం, తిరునాళ్ల ముగించుకొని వస్తుండగా ఇద్దరు యువకులపై విచక్షణారహితంగా దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు,...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.