
ఇంట్లో పాత, విరిగిన కుర్చీలు పడి ఉంటే వాటితో మీరు అందమైన గార్డెన్ స్టాండ్‌ను తయారుచేయవచ్చు. ఈ DIY ఐడియా మీ పెరడుకు లేదా బాల్కనీకి ప్రత్యేకమైన వింటేజ్ లుక్‌ను ఇస్తుంది. పాత కుర్చీలతో గార్డెనింగ్ ఎలా చేయాలో చూద్దాం. పాత కుర్చీని శుభ్రంగా తుడవాలి. కుర్చీ సీటు పగిలిపోయినా, గరుకుగా ఉన్నా దానిపై కుండీ పెట్టడానికి వీలుగా ఒక చెక్క పలకను అమర్చాలి. సీటు పూర్తిగా విరిగిపోతే దాన్ని తీసేయండి. బాగానే ఉంటే, మధ్యలో పూల కుండీ పట్టేంత సైజులో రంధ్రం చేసి, దానిపై మీకు నచ్చిన కుండీని పెట్టుకోవచ్చు. పాత చెక్క కుర్చీని హ్యాంగింగ్ ప్లాంటర్‌గా మార్చవచ్చు. సీటు, ముందు కాళ్లను తీసేయండి. ఇప్పుడు, కుర్చీ వెనుక భాగాన్ని గోడకు బిగించండి. చిన్న వేలాడే మొక్కలను కొక్కేలు లేదా రాడ్ల సహాయంతో వేలాడదీయండి. ఇది అందమైన, క్రియేటివ్ గార్డెన్ వాల్‌ను సృష్టిస్తుంది
.