
Vizianagaram Land Acquisition: విజయనగరం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలకు సంబంధించిన భూసేకరణ (Land Acquisition) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తమ ఛాంబర్లో మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్‌తో కలిసి ఆయన ఆర్డీవోలు, తాసిల్దార్లతో విస్తృతంగా చర్చించారు. నిర్దేశిత గడువులోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి పారిశ్రామికవేత్తలకు భూములను అప్పగించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ మరియు పారిశ్రామిక అవసరాల కోసం జిల్లాలోని ప్రతి మండలంలో కనీసం 100 ఎకరాలకు తగ్గకుండా ప్రభుత్వ లేదా అసైన్డ్ భూములను ముందస్తుగా గుర్తించి ‘ల్యాండ్ బ్యాంక్’ సిద్ధంగా ఉంచాలని తాసిల్దార్లకు సూచించారు. పరిశ్రమల స్థాపన కోసం భూములు కోల్పోతున్న స్థానిక రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలని, ఆయా పరిశ్రమల్లోనే వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. Read also: Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం–తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి ! జిల్లాలో ప్రతిపాదిత మరియు ప్రస్తుతం పరిశీలనలో ఉన్న పలు కీలక ప్రాజెక్టుల భూ అవసరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు: జిల్లాలో ఏపీఐఐసీకి అప్పగించిన, ప్రతిపాదించిన ఇతర భూముల పురోగతిని కూడా ఈ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు: ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ మాట్లాడుతూ.. భూసేకరణలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా పారదర్శకంగా, వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. సమీక్షలో ఆర్డీవోలు సుధాసాగర్, మోహనరావు, ఎస్డీసీ అరుణకుమారి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వి.కృష్ణప్రసాద్, సంబంధిత మండలాల తాసిల్దార్లు పాల్గొన్నారు. Velairpadu Fire Accident: వేలేరుపాడులో ఘోర అగ్ని ప్రమాదం! Byri Shankar Mudiraj: తెలంగాణ ఏర్పాటులో బిజెపి
పాత్ర కీలకం!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Amalapuram Minor Abortion:మైనర్ గర్భస్రావం కేసుపై కలెక్టర్ సీరియస్!
Manyam District Elephants:భయాందోళనకు గురి చేస్తున్న గజరాజులు!
Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం–తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి !
Chandrababu Naidu: లాటరైట్ వర్గీకరణ మార్పుపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ సీబీ సీఐడీ మాజీ అధినేత, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ లక్ష్యంగా...
తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ కోసమే తాను పర్యటిస్తున్నానంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్...
ప్రజా గాయకుడు, దివంగత గద్దరన్నతో తనకు ఉన్న వ్యక్తిగత, భావోద్వేగ అనుబంధాన్ని జనసేన అధినేత పవన్...
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలని,...
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని,...
తాను ఒక చెరువును ఆక్రమించుకున్నానంటూ వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...
ఆర్సీబీ వరుసగా బ్యాక్-టు-బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. ఐపీఎల్ 2026లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు...
రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు...
భారతదేశం, నేపాల్ దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు పూర్తిగా రెండు దేశాలకు సంబంధించిన అంతర్గత...
తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య చెలరేగిన రాజకీయ...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.