
Manyam District Elephants: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల పరిధిలోని మార్కొండపుట్టి పంచాయతీ గ్రామాల్లో గజరాజులు మళ్లీ కలకలం సృష్టించాయి. మంగళవారం ఉదయం నుండి పెదగాసిల, పాతగాసిల, కే.గాసిల గ్రామాలలో ఏనుగుల గుంపు స్వైరవిహారం చేయడంతో స్థానిక గ్రామస్తులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏనుగుల కదలికలను గమనించిన అటవీ శాఖ ఎలిఫెంట్ ట్రాకర్ల (Elephant Trackers) బృందం వాటిని పర్యవేక్షిస్తూ అడవిలోకి తోలేందుకు ప్రయత్నించింది. అయితే, ఏనుగుల గుంపు వచ్చిందనే వార్త తెలియడంతో పరిసర ప్రాంతాల నుండి జనాలు వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో జనాల తాకిడిని నియంత్రించలేక, ఏనుగులను దారి మళ్లించలేక ఫారెస్ట్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. Read also: Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం–తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి ! గత కొన్ని సంవత్సరాలుగా మన్యం జిల్లాలో గజరాజులు స్థిర నివాసాలు ఏర్పరచుకుని సంచరిస్తున్నాయి. అధికారులు వీటిని పూర్తిగా దట్టమైన అడవుల్లోకి తరలించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవి మళ్లీ మళ్లీ గ్రామాల సమీపంలోకే వస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు పరిసర గ్రామాల్లో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అలర్ట్ చేస్తున్నప్పటికీ, ఏ క్షణంలో ఏనుగులు ఏ వైపు నుండి దాడి చేస్తాయోనని ఇక్కడి ప్రజలు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. మంగళవారం ఉదయం పాతగాసిల గ్రామ సమీపంలోకి ప్రవేశించిన గజరాజుల గుంపు అక్కడ ఉన్న ఒక పెద్ద అరటి తోటలో తిష్ట వేసింది. తోటలోని అరటి చెట్లను పూర్తిగా తొక్కి వేయడమే కాకుండా.. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గోవుల సాల (పశువుల కొట్టం) ను, రైతులు అమర్చుకున్న డ్రిప్ ఫిల్టర్లను, ఇతర విలువైన వ్యవసాయ ఉపకరణాలను పూర్తిగా తొక్కి ధ్వంసం చేశాయి. దీనివల్ల తమకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని, చేతికొచ్చే పంటతో పాటు పెట్టుబడి పెట్టిన పరికరాలు కూడా విరిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు కన్నీరుమున్నీరయ్యారు. తమను
ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, శాశ్వత ప్రాతిపదికన ఈ ఏనుగుల దారి మళ్లించి, అవి మళ్లీ జనావాసాల్లోకి రాకుండా దట్టమైన అడవుల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని మన్యం గ్రామస్తులు గట్టిగా కోరుకుంటున్నారు.
Narmeta Oil Palm Factory:నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై అపోహలు నమ్మవద్దు: మేనేజర్
Peddi Movie Ticket Price:పెద్ది’ సినిమా టికెట్ ధరలు భారీగా పెంపు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Amalapuram Minor Abortion:మైనర్ గర్భస్రావం కేసుపై కలెక్టర్ సీరియస్!
Vizianagaram Land Acquisition: భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష!
Velairpadu Fire Accident: వేలేరుపాడులో ఘోర అగ్ని ప్రమాదం!
Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం–తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి !
Chandrababu Naidu: లాటరైట్ వర్గీకరణ మార్పుపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్
తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ కోసమే తాను పర్యటిస్తున్నానంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్...
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని,...
తాను ఒక చెరువును ఆక్రమించుకున్నానంటూ వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...
ఆర్సీబీ వరుసగా బ్యాక్-టు-బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. ఐపీఎల్ 2026లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు...
రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు...
తెలంగాణ కాంగ్రెస్, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. జనసేన అధినేత, ఏపీ...
తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య చెలరేగిన రాజకీయ...
లాటరైట్ ఖనిజ వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్ రంగం...
భారతదేశం, నేపాల్ దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు పూర్తిగా రెండు దేశాలకు సంబంధించిన అంతర్గత...
భారత్‌లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం అదనంగా ఉండాలనుకునే విదేశీయుల కోసం కేంద్ర...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.