
అది ఒక నిష్కల్మషమైన నవ్వులు చిందించే వయసు.. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన అర్భక ప్రాణం. కానీ ఆ పసికందు పాలిట అమ్మే ఒక కాలయముడిగా మారింది. తన వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడనే క్రూరత్వంతో, కన్నతల్లి- ఆమె ప్రియుడు కలిసి ఒక ఏడాదిన్నర పసి బాలుడిని అత్యంత కిరాతకంగా హింసించి చంపేసిన ఘోర కలియుగ ఉదంతం కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలుగుచూసింది. కేవలం 18 నెలల వయసున్న అర్షిద్ అనే చిన్నారి శరీరంపై శవపరీక్షలో తేలిన గాయాల వివరాలు చూసి న్యాయమూర్తులు, పోలీసులు, వైద్యులతో సహా యావత్ సమాజం ఒక్కసారిగా నివ్వెరపోయింది.51 గాయాలు.. సిగరెట్ కాలిన గుర్తులు.. నరకయాతన!పోలీసుల కథనం ప్రకారం.. గత శుక్రవారం తిరువనంతపురంలోని శ్రీ అవిట్టం తి రునాళ్ (SAT) ఆసుపత్రికి ఒక పసిబాబును తీసుకువచ్చారు. అన్నం తింటూ గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక స్పృహతప్పిపోయాడంటూ తల్లి ప్రియుడు అష్కర్ వైద్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడి శరీరంపై ఉన్న కొన్ని అనుమానాస్పద గుర్తులను గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఆ తర్వాత వచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక ఆ పసివాడు అనుభవించిన నరకయాతనను కళ్లకు కట్టింది. బాలుడి శరీరంపై ఏకంగా 51 తీవ్రమైన గాయాలు ఉన్నట్లు తేలింది. అందులో కొన్ని తాజాగా తగిలిన గాయాలు కాగా.. మరికొన్ని నెలల తరబడి కొట్టడం వల్ల ఏర్పడిన పాత మచ్చలు. ఆ రాక్షసులు పసివాడి రెండు చేతులను, పక్కటెముకలను విరగ్గొట్టారు. అంతటితో ఆగక, ఆ చిన్నారి జననేంద్ర అవయవాలపై, కాళ్ల పాదాల కింద సిగరెట్లతో కాల్చి పైశాచిక ఆనందం పొందారని నిర్ధారణ అయ్యింది.గొంతులో అన్నం ఇరుక్కోలేదు.. గోడకేసి కొట్టాడు!నెడుమంగడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DySP) బిజు కుమార్ కేసు వివరాలను వెల్లడిస్తూ.. డ్యాన్సర్ అయిన తల్లి అఖిల (24), తన ప్రియుడు అష్కర్ (31) లతో కలిసి గత ఐదు నెలలుగా కరిక్కుజి
అది ఒక నిష్కల్మషమైన నవ్వులు చిందించే వయసు.. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన అర్భక ప్రాణం. కానీ ఆ పసికందు పాలిట అమ్మే ఒక కాలయముడిగా మారింది. తన వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడనే క్రూరత్వంతో, కన్నతల్లి- ఆమె ప్రియుడు కలిసి ఒక ఏడాదిన్నర పసి బాలుడిని అత్యంత కిరాతకంగా హింసించి చంపేసిన ఘోర కలియుగ ఉదంతం కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలుగుచూసింది. కేవలం 18 నెలల వయసున్న అర్షిద్ అనే చిన్నారి శరీరంపై శవపరీక్షలో తేలిన గాయాల వివరాలు చూసి న్యాయమూర్తులు, పోలీసులు, వైద్యులతో సహా యావత్ సమాజం ఒక్కసారిగా నివ్వెరపోయింది.51 గాయాలు.. సిగరెట్ కాలిన గుర్తులు.. నరకయాతన!పోలీసుల కథనం ప్రకారం.. గత శుక్రవారం తిరువనంతపురంలోని శ్రీ అవిట్టం తి రునాళ్ (SAT) ఆసుపత్రికి ఒక పసిబాబును తీసుకువచ్చారు. అన్నం తింటూ గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక స్పృహతప్పిపోయాడంటూ తల్లి ప్రియుడు అష్కర్ వైద్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడి శరీరంపై ఉన్న కొన్ని అనుమానాస్పద గుర్తులను గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఆ తర్వాత వచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక ఆ పసివాడు అనుభవించిన నరకయాతనను కళ్లకు కట్టింది. బాలుడి శరీరంపై ఏకంగా 51 తీవ్రమైన గాయాలు ఉన్నట్లు తేలింది. అందులో కొన్ని తాజాగా తగిలిన గాయాలు కాగా.. మరికొన్ని నెలల తరబడి కొట్టడం వల్ల ఏర్పడిన పాత మచ్చలు. ఆ రాక్షసులు పసివాడి రెండు చేతులను, పక్కటెముకలను విరగ్గొట్టారు. అంతటితో ఆగక, ఆ చిన్నారి జననేంద్ర అవయవాలపై, కాళ్ల పాదాల కింద సిగరెట్లతో కాల్చి పైశాచిక ఆనందం పొందారని నిర్ధారణ అయ్యింది.గొంతులో అన్నం ఇరుక్కోలేదు.. గోడకేసి కొట్టాడు!నెడుమంగడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DySP) బిజు కుమార్ కేసు వివరాలను వెల్లడిస్తూ.. డ్యాన్సర్ అయిన తల్లి అఖిల (24), తన ప్రియుడు అష్కర్ (31) లతో కలిసి గత ఐదు నెలలుగా కరిక్కుజి ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో ఉంటోంది. అఖిల మొదటి భర్త ఈ బాబు పుట్టకముందే ఆత్మహత్య చేసుకున్నాడు. అష్కర్‌తో తన జీవితానికి ఈ బాబు అడ్డుగా ఉన్నాడని భావించి, వాళ్లిద్దరూ బాబును వదిలించుకోవాలని చూశారు. అని తెలిపారు. వైరల్ వీడియో: పడక సుఖం కోసం పాపం.. స్తంభానికి కట్టి కర్రలతో కొట్టి చంపేశారు!శుక్రవారం అఖిల ఒక డ్యాన్స్ ప్రోగ్రాం కోసం తమిళనాడు వెళ్లగా, బాబును అష్కర్ వద్ద వదిలివెళ్లింది. మధ్యాహ్నం అన్నం తినిపించే సమయంలో బాబు గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అష్కర్, ఆ పసివాడి తలను గట్టిగా గోడకేసి కొట్టాడు. దీనివల్ల బాలుడి తలలో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయాడని, వంతులు-దగ్గు అనేది కేవలం కొట్టడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ మాత్రమేనని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది.సాక్ష్యాల ధ్వంసం.. ప్రజల తీవ్ర ఆగ్రహం!దారుణం జరిగిన తర్వాత నిందితులు ఇద్దరూ కలిసి ఇంట్లోని సాక్ష్యాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు. రక్తం అంటిన చిన్నారి బట్టలను, మెడికల్ ప్లాస్టర్ కాస్ట్‌లను ఇంటి వెనుక తోటలో వేసి తగలబెట్టారు. ఈ దారుణం తెలుసుకున్న స్థానికులు, నిందితుడు అష్కర్‌ను పోలీసులు విచారణ కోసం సంఘటనా స్థలానికి తీసుకువచ్చినప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసుల రక్షణ వలయాన్ని ఛేదించుకుని మరీ నిందితుడిపై భౌతిక దాడికి దిగారు. అతని కారును ధ్వంసం చేశారు.  వ్యభిచారం చేస్తేనే ఇంట్లో ఉంచుతాం! అత్తింటి కిరాతకానికి పసికందు తల్లి సూసైడ్!నేరాల చరిత్ర ఉన్న సైకో!పోలీసుల దర్యాప్తులో నిందితుడు అష్కర్‌కు సంబంధించిన మరికొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఇతనికి 2021లోనే అమీనా అనే మహిళతో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం ఆమెను నిత్యం చిత్రహింసలు పెట్టేవాడు. ఆమె తలను కూడా ఇలాగే గోడకేసి కొట్టడంతో, ఆమె దాదాపు ఏడాది పాటు తిరువనంతపురం మెడికల్ కాలేజీలో కోమాలో బెడ్‌రైడన్‌గా ఉండిపోయింది. ఆమెను అలాగే వదిలేసి అఖిలతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. గతంలో మరో యువతి అనుమానాస్పద మృతి కేసులోనూ ఇతని పాత్రపై పోలీసులు ఇప్పుడు విచారణ ముమ్మరం చేశారు.ప్రస్తుతం నిందితులు ఇద్దరినీ కోర్టు రిమాండ్ విధించగా, కేరళ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బిందు కృష్ణ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.