
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. శ్రావణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. శ్రావణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మద్యం మత్తులో జరిగిన ఘర్షణగా పోలీసులు చెప్పారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావణ్ తన స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి మద్యం తాగాడు. అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ విషయంలో వారు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మరో యువకుడు కత్తితో శ్రావణ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రావణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.