సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన 'జైలర్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన 'జైలర్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.600 కోట్లకు పైగా భారీ గ్రాస్ వసూళ్లు సాధించి, కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు రూ.75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి అగ్ర నటుల అతిథి పాత్రలు సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. దీంతో ఇప్పుడు రూపొందుతున్న సీక్వెల్ ‘ జైలర్ 2 ’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మొదటి భాగం తరహాలోనే ఈ సీక్వెల్లో కూడా మరిన్ని క్రేజీ క్యామియోలు ఉంటాయని దర్శకుడు నెల్సన్ ప్రకటించడంతో, ఇందులో ఎవరెవరు నటిస్తున్నారనే ఉత్కంఠ అందరిలోనూ పెరిగింది. * పొల్లాచ్చి షెడ్యూల్‌కు సిద్ధమైన ‘మెగా 158’.. చిరంజీవిపై భారీ యాక్షన్ సీక్వెన్స్! ఈ సినిమాలో ఒక అత్యంత పవర్ఫుల్ క్యామియో రోల్ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి ఈ పాత్ర కోసం మొదట నందమూరి బాలకృష్ణను సంప్రదించగా, ఆయన తన బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు ఈ రోల్ ఆఫర్ చేయగా, ఆయన కూడా తన ‘కింగ్’ సినిమా షూటింగ్ కమిట్మెంట్స్ వల్ల దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్‌ను కూడా సంప్రదించారనే టాక్ నడిచింది. చివరికి ఈ పవర్ఫుల్ గెస్ట్ రోల్ కోసం మేకర్స్ హృతిక్ రోషన్‌ను లాక్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హృతిక్ ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ‘జైలర్ 2’ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఖాయం. రజనీకాంత్ మాస్ స్వాగ్‌కు తోడు హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్, స్ట్రైకింగ్ లుక్స్ తోడైతే వెండితెరపై పూనకాలు గ్యారెంటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు.* ‘నాన్నా.. ఎప్పటికీ మీరే నా హీరో’... కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్! 40 ఏళ్ల నాటి స్పెషల్ కనెక్షన్మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దాదాపు 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘భగవాన్ దాదా’ (1986)లో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. రజనీకాంత్ పెంపుడు కొడుకు పాత్రలో అప్పట్లో హృతిక్ అలరించారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే రజనీకాంత్ సినిమాలో హృతిక్ గెస్ట్ రోల్లో మెరవనుండటం నిజంగా ఒక అరుదైన విశేషమనే చెప్పాలి. ఇక హృతిక్ రోషన్ కెరీర్ విషయానికొస్తే.. గతేడాది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ప్రస్తుతం తన మోస్ట్ అవేటెడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్ 4’ (Krrish 4) చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ అప్డేట్స్తో ‘జైలర్ 2’ అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ స్పెషల్ క్యామియోపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.