
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, రాష్ట్ర అత్యున్నత పదవి వరకు సాగింది.
ఈ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా మంత్రులు సీతక్క (Seethakka), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో అలుపెరగని పోరాటం చేస్తూ, నేడు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న తీరును నేతలు ప్రశంసించారు.