
నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటించారు. అక్కడి ఆంజనేస్వామి (Anjaneyaswamy)ని సీఎం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 20 ఏళ్ల క్రితం మిడ్జిల్ జడ్పీటీసీ (Midjil ZPTC)గా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన సంగతి తెలిసిందే. జడ్పీటీసీగా తన విజయానికి సహకరించిన వారిని సీఎం కలిశారు. అనుచరులు, జిల్లా నేతల (District leaders)తో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. తన రాజకీయ అనుచరులను ఆత్మీయంగా పలకరించారు. మిత్రులతో కలిసి ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు.