
బూర్గంపహాడ్, జూలై 04 : ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓ, సూపర్వైజర్లు ఓటర్ల సమాచారం ఎన్యుమరేషన్ ఫారంలో నింపేటప్పుడు ఓటర్లకు సంబంధించి సమాచారం...
బూర్గంపహాడ్, జూలై 04 : ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓ, సూపర్వైజర్లు ఓటర్ల సమాచారం ఎన్యుమరేషన్ ఫారంలో నింపేటప్పుడు ఓటర్లకు సంబంధించి సమాచారం సమగ్రంగా ఉండేలా పూరించాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. శనివారం బూర్గంపహాడ్ రైతు వేదికలో బీఎల్ఓ, సూపర్వైజర్ల అవగాహన సదస్సులో వారికి ఆయన పలు సూచనలు చేశారు. 2002 ఓటరుకు సంబంధించి ఒక బాక్సు, 2002 ఓటులేని వారి కోసం మరో బాక్సు ఉంటుందని ఈ రెండు బాక్సులో ఒకదానిని పరిస్థితికి ఆధారంగా ఎంచుకుని ఎన్యుమరేషన్ ఫారం నింపాల్సి ఉంటుందని, ఇది ప్రజలకు అర్ధంకాక పోవడంతో వారికి బీఎల్ఓ, సూపర్వైజర్లు అవగాహన కల్పించి ఫారం తప్పులు లేకుండా నింపేలా చూడాలని సూచించారు. అర్హత కలిగిన ఓటరు ఓట్లు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఫారంలో సూచించిన ప్రకారం అన్ని పత్రాలు ఓటరు దగ్గర పెట్టుకోవాలని, ఓటరు జాబితా సమగ్ర సవరణ పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పీవీటీజీ అధికారి గన్యానాయక్, తహశీల్దార్ కేఆర్కే ప్రసాద్, డీటీ సమ్మయ్య పాల్గొన్నారు.