
దిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon session of Parliament) జులై 20నుంచి ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) వెల్లడించారు.
ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ సమావేశాల్లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసే ప్రసంగంతో పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయి. ఇదీ చదవండి: ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 23 మందిని టెర్రరిస్ట్లుగా ప్రకటించిన కేంద్రం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పుదుచ్చేరిలో వారసత్వ కట్టడం పర్యాటకులను ఆకర్షిస్తోంది. 190 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఓల్డ్ లైట్హౌస్’ అందుబాటులోకి వచ్చింది.