
స్మార్ట్ ఫోన్ కు వెనకాల ఉండే కెమెరాల్లో ఏది ఫోటో తీస్తుంది. మూడు, నాలుగు ఉన్నంత మాత్రాన అవన్నీ ఓకేసారి ఫోటో తీయగలవా? అసలు ఏ కెమెరా పనిచేస్తుందో తెలుసా.
చాలా స్మార్ట్ఫోన్ల వెనుక మూడు లేదా నాలుగు కెమెరాలు ఉంటాయి. జనం వీటితోనే ఫొటోలు తీసుకుంటారు. కానీ ఫొటో తీసేటప్పుడు ఏ కెమెరా పనిచేస్తుందో చాలామందికి తెలియదు.
దూరంగా ఉన్న దాన్ని దగ్గరగా జూమ్ చేసి తీయడానికి ఒక కెమెరా సాయపడుతుంది. అలాగే, లాంగ్ షాట్ వ్యూ క్లిక్ చేసేటప్పుడు మరో కెమెరా ఆన్ అవుతుంది. ఒకే ఫోన్‌తో అన్ని యాంగిల్స్‌లో ఫొటోలు తీసుకోవచ్చు. దీనికి తోడు, చాలా స్మార్ట్ఫోన్లు ఇప్పుడు AI, ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని వాడుతున్నాయి. ఈ టెక్నాలజీతో ఫొటోల క్వాలిటీ మరింత మెరుగవుతోంది.