
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
20 ఏళ్ల క్రితం మిడ్జిల్ జడ్పీటీసీగా రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన సంగతి తెలిసిందే. జడ్పీటీసీగా తన విజయానికి సహకరించిన వారిని ఇవాళ సీఎం కలిశారు. అనుచరులు, జిల్లా నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. తన రాజకీయ అనుచరులను ఆత్మీయంగా పలకరించారు. మిత్రులతో కలిసి ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటీవల మరణించిన ఓ యువకుడి కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మహేష్ అనే వ్యక్తి కాలితో తన్నడంతో యువకుడు లారీ కింద పడి మరణించినట్లు తేలింది.
ఇండిపెండెంట్ జడ్పీటీసీ To సీఎం.. ఇదీ రేవంత్‌రెడ్డి కెరీర్ గ్రాఫ్. మంత్రిగా పనిచేయకుండానే ముఖ్యమంత్రి కావడం ఓ ప్రత్యేకత.