
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా సంక్షోభం వేళ అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వంపై పాకిస్థాన్‌తో పోల్చడంపై చైనాలో భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి (Vikram Doraiswami) ఘాటుగా స్పందించారు.
ఆ దేశంతో పోలిక అవసరం లేదన్న ఆయన.. అలా పోల్చడం ఆయా దేశాల ప్రయోజనాలకు మేలు చేస్తుందో?లేదో అనే విషయాన్ని వారే గ్రహించుకోవాలన్నారు. ఈ విషయంలో భారత్.. పాక్‌ను (Pakistan) అనుసరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీజింగ్‌లో జరుగుతున్న ఓ సదస్సులో దొరైస్వామి మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ పాత్ర, పాక్ మధ్యవర్తిత్వంపై ఓ చైనా పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు దీటుగా బదులిచ్చారు.
‘‘పాకిస్థాన్‌తో పోల్చడాన్ని అన్యాయంగానే భావిస్తున్నా. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలే మనకు చాలా విషయాలు చెబుతాయి. విస్తృత ప్రపంచ వ్యవస్థలో కొన్ని దేశాల స్థానం ఏంటి? వాస్తవానికి ఏం చేస్తున్నాయి? అనే విషయాన్ని గమనించాలి. ప్రపంచంతో భారత్‌కు ఉన్న సంబంధాలు చాలా దేశాలకు అందనంత స్థాయిలో ఉన్నాయి. ఐరోపా, ఆసియా దేశాలతో ఆర్థిక అంశాలతో పాటు శాంతి, భద్రతలకు సంబంధించిన కీలక సమస్యలకు సహకరించడానికి సిద్ధంగా ఉండటం వంటివి ఇందులో ఉన్నాయి’’ అని దొరస్వామి తెలిపారు. 14వ ప్రపంచ శాంతి వేదిక సదస్సులో ‘ప్రొటెక్షనిజం అండ్ గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్ ప్యానెల్’పై జరిగిన చర్చలో ఆయన ఈ విధంగా మాట్లాడారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.