
కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటించారు. రూ.117 కోట్లతో అధునాతన బస్‌స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయన్నారు. ‘‘ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడికి రావాలి. కుప్పం నుంచి మరోచోటుకు వెళ్లే పరిస్థితులు రాకూడదు. రూ.9,320 కోట్లతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం’’ అని వివరించారు. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం: చంద్రబాబు |