
జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్రం ఓ విజన్ లేని నాయకుడి చేతిలో అల్లాడిపోతుందని, సీఎం రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నాడన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గండ్ర మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లా ప్రధాన దవాఖాన పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. పోస్టుమార్టం కోసం వచ్చిన శవాల మాంసాలను కుక్కలు పీక్కుతినే దీనస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రతి పక్షాలను తిట్టడమే లక్ష్యంగా పని చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముందు చూపుతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే విజన్ లేని రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.