
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ టేకులపల్లి, జూలై 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ టేకులపల్లి, జూలై 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. బొమ్మనపల్లి పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగులను తనిఖీ చేసి యూరియా నిల్వలు, పంపిణీ వివరాలను పరిశీలించారు. రైతులు యూరియా బుకింగ్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని, నానో యూరియా వినియోగంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం 9వ మైలు తండాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పరిశీలించి అర్హులైన ప్రతి ఓటరిని నమోదు చేసి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. టేకులపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్వో ప్లాంట్ను వెంటనే మరమ్మతు చేయాలని, విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన తాగునీరు, పోషకాహారం, మెరుగైన హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తాసీల్దార్ వీరభద్రం, ఎంఈఓ జగన్, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.
[caption id="attachment_2439388" align="alignnone" width="1200"] 'రైతులు నానో యూరియా వినియోగంపై అవగాహన పెంచుకోవాలి'[/caption]