
తెలంగాణ సంస్కృతికి, పండుగలకు బోనాలు ఎంతో ప్రత్యేకం. ఈ పండుగ సీజన్ వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో బోనాల పాటలు మార్మోగిపోతుంటాయి. ఇప్పటికే విడుదలైన ఒక ఊరమాస్ సాంగ్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
'ఇడుపు కాయితం' ఫేమ్ నాగదుర్గ నటించిన "నా పేరే ఎల్లమ్మ" సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో, రీల్స్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.
ఈ ఊరమాస్ బోనాల స్పెషల్ సాంగ్ 2025 జూలై 4న ప్రీమియర్‌గా విడుదలైంది. రిలీజైనప్పటి నుంచి ఈ సాంగ్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ పాట ఏకంగా 114,777,860 వ్యూస్ సాధించి యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. పెద్దలతో పాటు యువతకు సైతం ఈ సాంగ్ పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్‌లో ఈ పాట ఆడియో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. నాగదుర్గ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఈ పాటకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది.
ఈ క్రేజీ సాంగ్ వెనుక ఒక పెద్ద టెక్నికల్ టీమ్ కష్టం ఉంది. ఈ పాటను దర్గుపల్లి ప్రభాకర్ నిర్మించారు. ఇన్‌స్టాలో ఫేమస్ అయిన 'కొరంటి మధు అమ్మ' నుంచి ఈ ట్యూన్ సోర్స్‌ను తీసుకున్నారు. ఈ పాటకు రాజేందర్ కొండ అద్భుతమైన లిరిక్స్ అందించగా, సింగర్ ప్రభా తన వాయిస్‌తో పూనకాలు తెప్పించారు. మదీన్ ఎస్కే అదిరిపోయే మ్యూజిక్ అందించారు. డిజె లింగా మిక్సింగ్ బాధ్యతలు చూసుకున్నారు.
ఈ సాంగ్ విజువల్‌గా కూడా చాలా గ్రాండ్‌గా ఉంది. కమ్లీ పటేల్ డీఓపీగా వ్యవహరించగా, రెండో కెమెరాను డీజే సురేష్ హ్యాండిల్ చేశారు. శేఖర్ వైరస్ మాస్ స్టెప్పులతో కొరియోగ్రఫీ అదరగొట్టారు. అజయ్ కోడమ్ ఎడిటింగ్, డీఐతో పాటు టెక్నికల్ సపోర్ట్ అందించారు. భరత్ ప్రొడక్షన్ కంట్రోలర్‌గా, సాగర్ ముదిరాజ్ పోస్టర్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి మహేష్ పెగ్గర్ల మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ టీమ్ వర్క్ వల్లే 'నా పేరే ఎల్లమ్మ' సాంగ్ ఇప్పుడు ప్రతి ఇంటా మార్మోగుతోంది.
సుట్టు సెట్టు సెలకల్లా నేను సక్కని తల్లినే