
ప్రముఖ నటుడు, హీరో శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. హీరోగా సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ రోల్స్ లో కూడా మెప్పించాడు.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, లై, దడ లాంటి చిత్రాల్లో శ్రీరామ్ కీలక పాత్రల్లో మెరిశారు. శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో ఉండే కష్టాల గురించి మాట్లాడారు.
నటుడిగా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది. కొన్ని సినిమాలలో ఇష్టపడి ఎంతో కష్టపడ్డప్పటికీ ఫలితం ఉండదు. ఇలాంటి అనుభవాలన్నీ నాకు కెరీర్ బిగినింగ్ నుంచే ఎదురయ్యాయి. తాను హీరోగా నటించిన తొలి చిత్రం రోజాపూలు మూవీ కోసం ఎన్నో ఇబ్బందులు భరించానని శ్రీరామ్ అన్నారు.
అసలు ఆ మూవీ రిలీజ్ అవుతుందే లేదో అనే టెన్షన్ ఉండేది. రోజూ సెట్ లో నిర్మాత, దర్శకుడు గొడవపడేవారు. చాలా చాలా కాలం షూటింగ్ ఆగిపోయింది. నేనే నిర్మాతని, దర్శకుడిని బతిమాలాడుకోవాలి. ఇక షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 2 వారాల్లో రిలీజ్ అనౌన్స్ చేశాం. ఒక సాంగ్ పెండింగ్ ఉంది. సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు భూమిక చిన్న సమస్య వల్ల పారిపోయింది. ఫోన్ కూడా ఎత్తలేదు. ఆ టైం లో ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదు అని దేవుణ్ణి ప్రార్థించా అని శ్రీరామ్ తెలిపారు. ఎలాగోలా షూటింగ్ పూర్తి చేసి ఆ చిత్రాన్ని రిలీజ్ చేశాం అని అన్నారు.
నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని చెత్త సినిమాలు చేశాను. ఆ టైంలో ఆర్థిక అవసరాలు ఉండడంతో తప్పలేదు. కొన్ని సినిమాలో ఆబ్లిగేషన్స్ వల్ల చేయాల్సి వచ్చింది. నాగ చైతన్య దడ చిత్రంలో నా ఇమేజ్ పెరుగుతుంది అని అనుకున్నా. ఆ మూవీలో రెండున్నర నిమిషాలు ఉండే యాక్షన్ సీన్ ఉంది. నా కెరీర్ లోనే ది బెస్ట్ యాక్షన్ సీన్ అవుతుంది అని అనుకున్నా.
8 నెలలు దానికోసమే కష్టపడ్డా.డూప్ లు, రోప్ లు సహాయం లేకుండా గాయాలు అయినపప్టికీ ఆ సీన్ పూర్తి చేశాను. చివరికి ఎడిటింగ్ లో నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఆ టార్చర్ భరించలేపోయా అని శ్రీరామ్ అన్నారు. ఎందుకు తొలగించారో కూడా తెలియదు అని శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.