
పోలీస్ కస్టడీ మరణం కేసులో మహారాష్ట్రలోని వాసిమ్ జిల్లా, సెషన్స్ కోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. సుమారు 15 ఏళ్ల క్రితం పోలీస్ స్టేషన్లో విచారణ పేరిట ఒక గిరిజన యువకుడిని దారు
ణంగా హింసించి చంపిన కేసులో.. అప్పటి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ (థానేదార్) సహా తొమ్మిది మంది పోలీసులకు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.అసలేం జరిగింది?ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే.. 2011 మే 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మహారాష్ట్రలోని రిసోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 'పార్ధి' (గిరిజన తెగ) వర్గానికి చెందిన 23 ఏళ్ల యువకుడు బెగ్యా నైను పవార్‌ను దొంగతనం అనుమానంతో పోలీసులు అతడిని ఇంటి నుంచి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేని బెగ్యా పవార్‌ను స్టేషన్‌కు తరలించి, నేరం అంగీకరించాలంటూ అప్పటి రిసోద్ థానేదార్ మహదేవ్ మాణిక్ ధాండే, ఇతర సిబ్బంది థర్డ్ డిగ్రీ ఉపయోగించి అత్యంత అనాగరికంగా కొట్టారు.పోలీసుల అమానుష దాడి కారణంగా బెగ్యా పవార్ పరిస్థితి విషమించడంతో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. అనంతరం నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో బెగ్యా పవార్ శరీరంపై 44 తీవ్రమైన గాయాలు, రక్తం గడ్డకట్టిన గుర్తులు, ఎముకలు విరిగినట్లు తేలడంతో పోలీసులు చేసిన అరాచకం ప్రపంచానికి తెలిసింది.న్యాయం కోసం సుదీర్ఘ పోరాటంఘటన జరిగిన తర్వాత, బాధితుడి వృద్ధ తల్లిదండ్రులు రిసోద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, నిందితులు తమ అధికారులే కావడంతో స్థానిక పోలీసులు