
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియలకు ఇరాన్ సిద్ధమైంది.
ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి లక్షలాదిగా అభిమానులు తరలివస్తారనే అంచనా. దీంతో వారిని నియంత్రించడం ఇరాన్ అధికారులకు సవాలుగా మారనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయతుల్లా రుహొల్లా ఖొమేనీ, ఖాసిమ్ సులేమానీ అంత్యక్రియల సమయంలో తోపులాటలు జరగడం, ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం వంటి దురదృష్టకర ఘటనలు ఇరాన్ పాలకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
ఇరాక్, ఇరాన్ దేశాల్లో అనేక నగరాల మీదుగా ఖమేనీ అంతిమయాత్ర (Khamenei Funeral) ఎటువంటి ఆటంకం లేకుండా సాగేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 5న ఈ ప్రక్రియ రాజధాని టెహ్రాన్‌లో మొదలై.. ఇరాక్‌లోని నజాఫ్, కర్బలా నగరాల్లో కొనసాగనుంది. ఆ తర్వాత పార్థివదేహాన్ని ఇరాన్‌లోని ఖోమ్ మీదుగా ఖమేనీ స్వస్థలం మషాద్‌కు జులై 9న తీసుకురానున్నట్లు సమాచారం. మతపెద్దల సమక్షంలో ప్రార్థనలు నిర్వహించి అక్కడే ఖననం చేయనున్నారు.
లక్షా 85వేల మంది చిన్నారులు.. బలవంతపు దత్తత!
రద్దీని నియంత్రించడం, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడడం అత్యంత సవాలుగా మారినట్లు ఇరాన్ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఏర్పాట్లకు సంబంధించి వారం క్రితం బాగ్దాద్‌లో పర్యటించిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ.. అక్కడి అధికారులతో చర్చించారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు ఖొమేనీ 1989 జూన్ 3న చనిపోగా.. ఆయన అంత్యక్రియలకు లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు. అంతిమయాత్ర సమయంలో శవపేటికను తాకేందుకు వేలాదిమంది ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తోపులాటలో అనేకమంది గాయపడగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. రంగంలోకి దిగిన భద్రతా దళాలు చివరకు హెలికాప్టర్లో పార్థివదేహాన్ని తరలించి ఖననం చేయాల్సి వచ్చింది.
2020లో అమెరికా డ్రోన్ దాడిలో సైనిక కమాండర్ ఖాసిమ్ సులేమానీ చనిపోగా.. ఆయన అంత్యక్రియలకు లక్షలాదిగా తరలివచ్చారు. ఇరాక్, ఇరాన్ నగరాల్లో అంతిమయాత్ర కొనసాగింది. ఆయన స్వస్థలం కెర్మన్‌కు చేరుకున్న సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ ఘటనలో 56 మంది చనిపోయారు. 200మందికి పైగా గాయపడ్డారు. దీంతో అంతిమయాత్రను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్రకు లక్షలాదిగా జనం రానున్న నేపథ్యంలో మునుపటి విషాద ఘటనలే ఇరాన్‌ను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
‘ఉగ్రవాది ఉగ్రవాదే’.. ఐరాస వేదికగా గళమెత్తిన భారత్
ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోగా. నాలుగు నెలలుగా ఆయన మృతదేహాన్ని ఎలా భద్రపరిచారనే విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం యుద్ధం కారణంగా అంత్యక్రియలు ఆలస్యం కావడంతో ఖమేనీ మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజీలోనే భద్రపరిచి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు తండ్రి మరణం తర్వాత ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ బయట ప్రపంచానికి కనిపించలేదు. ఫిబ్రవరి 28నాటి దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, ఆయన ముఖం గుర్తుపట్టకుండా మారిందనే వార్తలు వచ్చాయి. దీంతో తండ్రి అంత్యక్రియలకు ఆయన హాజరు అవుతారా? లేదా? అన్నది తెలియడం లేదు. అయితే, ఆయన హాజరుకాకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) మరోసారి తీవ్రరూపం దాల్చుతోంది. చమురుశుద్ధి కార్మాగారాలు లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేయడంతో రష్యాలో ఇంధన కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతిస్పందనగా అర్ధరాత్రి ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. కొన్నిగంటలపాటు క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. రాజధాని నగరం కీవ్‌లో భారీ పేలుళ్లు వినిపించడంతో ప్రజలు వణికిపోయారు. ఈ దాడుల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. ఆ ఫొటోలు..