ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలో పాడ్యమి తిథి నాడు అంటే 15 జూలై 2026 బుధవారం నాడు ప్రారంభం కానున్నాయి. జూలై 14న మధ్యాహ్నం 3:14 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు జూలై 15న ఉదయం 11:52 గంటల వరకు కొనసాగుతుంది.
ఉదయం తిథి ప్రకారం, ఆషాఢ గుప్త నవరాత్రులు అధికారికంగా జూలై 15 నంచి ప్రారంభమవుతాయి. జూలై 22న నవమి తిథి రోజున ముగుస్తాయి.
ఆషాఢ గుప్త నవరాత్రుల గురించి సామాన్య ప్రజలకు పెద్దగా అవగాహన ఉండదని పండితులు చెబుతారు. ఎందుకంటే ఇది ప్రధానంగా తంత్ర-మంత్ర విద్యలను ఆచరించేవారు చేసే సాధన(ఆధ్యాత్మిక సాధన)కు సంబంధించిన కాలం. ఈ కాలంలో సామాన్య ప్రజలు హిందూ మత విశ్వాసాల ప్రకారం, దుర్గాదేవిని ప్రత్యేక పూజలు చేస్తారు. మరోవైపు తాంత్రికులు ఆధ్యాత్మిక శక్తులను పొందడానికి ప్రత్యేక సాధనలు చేస్తారు. గుప్త నవరాత్రుల సమయంలో అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడే అమ్మవారి పది రూపాలైన ‘దశ మహావిద్యలను’ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
గుప్త నవరాత్రులలో భాగంగా దుర్గా మాతను మొత్తం పది రూపాల్లో పూజిస్తారు. ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలోని పాడ్యమి తిథి రోజున శుభ ముహుర్తంలో ఘటస్థాపన జరిపి, అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ముందుగా మొదటి రోజున కాళి మాత, రెండో రోజున తార మాత, మూడో రోజున త్రిపుర సుందరి, నాలుగో రోజున భువనేశ్వరి దేవి, ఐదో రోజున చిన్న మస్తా మాత, ఆరో రోజున త్రిపుర భైరవి మాత, ఏడో రోజు ధూమావతి, ఎనిమిదో రోజున బగల ముఖి, తొమ్మిదో రోజున మాతంగి, చివరగా పదో రోజున కమల దేవి రూపంలో మహా విద్యల పూజలు చేస్తారు.
సాధారణ నవరాత్రులలో భాగంగా దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో సాత్వికంగా పూజిస్తారు. అయితే గుప్త నవరాత్రులలో మాత్రం అమ్మవారిని ఆరాధించడానికి తాంత్రిక పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పూజలో పాల్గొనే వారు తమ కోరికలన్నింటినీ నెరవేర్చుకోవడానికి, పూజా సమయంలో ఏ మాత్రం గర్వం చూపకూడదు. గుప్త నవరాత్రులలో దేవి భక్తులు ఎంత రహస్యంగా ఆధ్యాత్మిక సాధన చేస్తే, అంత త్వరగా కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్మకం. గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. Read Latest Religion News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు. జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు. వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు. సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి