
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పోలీసు కంప్యూటర్ సర్వీసెస్‌లో ఆయన డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
హైదరాబాద్‌తో పాటు మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేశారు. భీమ్‌రెడ్డికి తెలంగాణ, కర్ణాటకలో వ్యవసాయ భూములు.. భారీగా స్థిరాస్తులున్నట్లు గుర్తించారు. నార్సింగిలోని ఇంట్లో రూ.43.6 లక్షల నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ACB సోదాలు.. డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్టు |