
‘సామాజిక భద్రత కోడ్-2020’ అమలులో భాగంగా ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీమ్-2026’ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసింది.
Jul 2 2026 6:35 PM | Updated on Jul 2 2026 6:49 PM
‘సామాజిక భద్రత కోడ్-2020’ అమలులో భాగంగా ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీమ్-2026’ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసింది. జూన్ 29న గెజిట్‌లో ప్రచురితమైన ఈ కొత్త నిబంధనలు అదే తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దాదాపు ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘ఈపీఎఫ్ స్కీమ్-1952’ స్థానంలో కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయితే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు, కంట్రిబ్యూషన్ రేట్లు, యూఏఎన్ వంటి కీలక అంశాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, పరిపాలనను మరింత డిజిటల్, పారదర్శకంగా మార్చడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.
కొత్త ఈపీఎఫ్ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటికీ ఉద్యోగి, యజమాని(కంపెనీ) చెల్లించే తప్పనిసరి పీఎఫ్ చందా యథాతథంగానే ఉంటుంది. ఉద్యోగి వేతనంలో 12 శాతం, యజమాని నుంచి మరో 12 శాతం చొప్పున పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేసిన కొన్ని సంస్థలకు ప్రస్తుతం అమల్లో ఉన్న 10 శాతం కంట్రిబ్యూషన్ విధానమే కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.15,000 వేతన పరిమితి (వేజ్ సీలింగ్)లో కూడా ఎలాంటి మార్పు చేయలేదు.
చట్టబద్ధంగా నిర్దేశించిన పీఎఫ్ చందాకు అదనంగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ‘వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్’ (VPF)లో మరింత మొత్తం జమ చేసే అవకాశం కొనసాగుతుంది. దీంతో ఎక్కువ పొదుపు చేయాలనుకునే ఉద్యోగులకు కొత్త స్కీమ్ కూడా అదే వెసులుబాటు కల్పించింది.
వైద్య చికిత్స, ఉన్నత విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర అత్యవసర అవసరాల కోసం పీఎఫ్ నుంచి పాక్షికంగా డబ్బు ఉపసంహరించుకునే నిబంధనలను కొత్త స్కీమ్ మరింత స్పష్టంగా పేర్కొంది. అయితే కనీస బ్యాలెన్స్, సభ్యత్వ కాలం వంటి నిర్దిష్ట అర్హతలను పాటించాల్సి ఉంటుంది.
ఈపీఎఫ్ నిర్వహణలో డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కొత్త స్కీమ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇకపై ఎలక్ట్రానిక్ ఫైలింగ్స్, ఆన్లైన్ క్లెయిమ్స్, ఈ-పాస్‌బుక్, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారిత సేవలకు ప్రాధాన్యం పెరుగుతుంది. దీంతో క్లెయిమ్‌ల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు పారదర్శకత కూడా మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మహమ్మారులు, అంటువ్యాధులు లేదా జాతీయ విపత్తుల వంటి అసాధారణ పరిస్థితుల్లో ఈపీఎఫ్ చందా రేటును తాత్కాలికంగా తగ్గించడం లేదా వాయిదా వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కొత్త స్కీమ్ ప్రత్యేక అధికారం కల్పించింది. అవసరమైన సందర్భాల్లో ఉద్యోగులు, సంస్థలకు ఉపశమనం కల్పించడమే దీని ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
సొంతంగా ‘ఎగ్జెంప్టెడ్ పీఎఫ్ ట్రస్టులు’ నిర్వహించే కంపెనీలపై కొత్త స్కీమ్ మరింత కఠినమైన పాలనా నిబంధనలను అమలు చేసింది. ట్రస్టీల అర్హతలు, ఎలక్ట్రానిక్ అకౌంటింగ్, వార్షిక ఆడిట్లు, ఆన్లైన్ డిస్క్లోజర్లు వంటి అంశాలను తప్పనిసరి చేసింది. దీంతో సభ్యుల నిధుల నిర్వహణలో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్నవారంతా ఆటోమేటిక్‌గా ‘ఈపీఎఫ్ స్కీమ్-2026’ పరిధిలోకి వస్తారు. వారి పీఎఫ్ బ్యాలెన్స్, ఇప్పటికే కూడబెట్టుకున్న నిధులు, సభ్యత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదు. కొత్తగా అర్హత పొందే ఉద్యోగులు కూడా ఇదే స్కీమ్ కింద నమోదు అవుతారు.
ప్రతి సభ్యుడికి కేటాయించే ‘యూనివర్సల్ అకౌంట్ నంబర్’ (UAN)లో ఎలాంటి మార్పు లేదు. ఉద్యోగులు సంస్థలు మారినా అదే యూఏఎన్ కొనసాగుతుంది. దీంతో పీఎఫ్ ఖాతా బదిలీలు, సేవా నిరంతరత సులభంగా కొనసాగుతాయి.
ఇదీ చదవండి: SBI యోనో యాప్‌లో కొత్తగా ఏఐ ఫీచర్లు
కొత్త ఈపీఎఫ్ స్కీమ్ వల్ల ఉద్యోగుల నెలవారీ పీఎఫ్ కట్, వడ్డీ రేటు లేదా ఇప్పటికే కూడబెట్టుకున్న పీఎఫ్ నిధులపై తక్షణ ప్రభావం ఉండదు. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ‘సామాజిక భద్రత కోడ్-2020’కు అనుగుణంగా ఈపీఎఫ్ వ్యవస్థను ఆధునికీకరించడం, డిజిటల్ సేవలను విస్తరించడం, పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చడం మాత్రమే.
ఇది చదివారా? ఆధార్, క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి కీలక మార్పులు
పింక్ శారీలో టాలీవుడ్ నటి అనసూయ గ్లామర్ (ఫొటోలు)
క్రాంతి కుమార్ కుటుంబానికి పరామర్శ, నేనున్నా అంటూ వైఎస్ జగన్ భరోసా (ఫొటోలు)
నాగబంధం ప్రమోషన్స్‌లో హీరోయిన్ నభా నటేష్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు రాజేంద్ర ప్రసాద్,సాయి కుమార్ (ఫొటోలు)
ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం (ఫొటోలు)
ప్రశ్న రావణీని కోర్టుకు తీసుకెళ్తుండగా జనసైనికుల ఓవర్ యాక్షన్
వీళ్ళ కోసమారా! సింహం లాంటి బుద్దోడిని పక్కన పెట్టారు
సీనియర్ NTR డైలాగ్ చెప్పిన హెరోయిన్ భాగ్య శ్రీ
ప్రశ్న రావణ్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు.. పవన్ కు బిగ్ షాక్
డెలివరీ బాయ్ ప్రాణం తీసిన పోలీస్ వాహనం ఎలా అంటే