
ఒంగోలు 60 ఫీట్ రోడ్డులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. సెలూన్ షాపులో పనిచేసే మహేంద్రరావు (30)ను మద్యం మత్తులో ఉన్న రామారావు కత్తితో పొడిచి చంపాడు.
తొలుత సెలూన్ షాప్ వద్ద గొడవ చేస్తున్న రామారావును అక్కడి నుంచి వెళ్లిపోవాలని మహేంద్ర కోరాడు. ఈక్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. రామారావు సెలూన్లోని కత్తులతో దాడికి దిగి హత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సెలూన్లో గొడవ.. అక్కడి కత్తితోనే దారుణ హత్య |