ఇంటర్నెట్డెస్క్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో ఎలాంటి రాజీ లేదని ఐరాస వేదికగా భారత్ పునరుద్ఘాటించింది (Terrorism Response). ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించలేమని వెల్లడించింది.
ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహంపై ఐక్యరాజ్యసమితి తాజాగా జరిపిన సమీక్షలో భాగంగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు.
‘‘ఉగ్రవాది ఉగ్రవాదే! ఉగ్రవాదాన్ని సమర్థించడానికి ఎలాంటి కారణాలు వెతకకుండా.. ఈ హంతక భావజాలాన్ని సమూలంగా నిర్మూలించడానికి మనం చేయిచేయి కలిపి పనిచేయాలి’’ అని మనదేశం తరఫున హరీశ్ పిలుపునిచ్చారు. సీమాంతర ఉగ్రవాదం వల్ల భారత్ భారీగా నష్టపోతోందని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.