
మనదేశంలో అత్యంత ఆదరణ పొందిన పానీయం ప్రజారోగ్య సాధనంగా మారనుందా? నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎన్ఏఎంఎస్) నిపుణుల బృందం సూచన అమలైతే ఇది నిజం కానుంది.
శిశువుల్లో పుట్టుకతోనే తలెత్తే నాడీ సంబంధ లోపాల నివారణకు టీలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 కలిపి కాబోయే అమ్మలకు అందించాలని ఈ బృందం సిఫారసు చేస్తోంది.
భారత్లో ఏటా లక్షకు పైగా మంది శిశువులు నాడీ లోపాలతో పుడుతున్నారని అంచనా. వీరిలో కొందరు తల్లి కడుపులోనే చనిపోయి పుడుతుంటారు. మరికొందరు పుట్టిన తర్వాత చనిపోతుంటారు లేదా వైకల్యంతో జీవిస్తుంటారు. కేవలం 20 శాతం మంది మాత్రమే శస్త్రచికిత్సతో కుదురుకునే అవకాశముంది. మిగిలిన వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటారు. వీరి చికిత్స కుటుంబాలకు ఆర్థిక భారంగా పరిణమిస్తుంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.