
హాజరైన మంత్రి నారా లోకేష్, టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం అనంతరం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...
హాజరైన మంత్రి నారా లోకేష్, టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం అనంతరం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ భేటీకి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరినీ మంత్రి లోకేష్ ఆత్మీయంగా పలకరించారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు జిల్లాలో పార్టీ బలోపేతంపై నేతలు చర్చించారు. పెద్దలంటే అదే భక్తి, అదే గౌరవం అంతకుముందు బొజ్జల సుధీర్ రెడ్డి నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నాయకులు, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి తల్లిగారైన బొజ్జల బృందమ్మ కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం పొందారు. పెద్దల పట్ల తన గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, మురళీ మోహన్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, టీడీపీ కోఆర్డినేటర్, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ సుగుణమ్మ, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, జిల్లా మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.