
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగిని అక్కడ పనిచేసే పింకీ అనే మహిళా స్వీపర్ (శానిటరీ...
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగిని అక్కడ పనిచేసే పింకీ అనే మహిళా స్వీపర్ (శానిటరీ ఉద్యోగిని) బూతులు తిడుతూ, కాళ్లతో విచక్షణారహితంగా తన్నింది. 35 సెకన్ల వ్యవధిలోనే ఆ రోగిని ఆమె దాదాపు 10 సార్లు కాళ్లతో తన్నుతున్నదృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియో నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించడమే కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది ప్రవర్తనపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.ఈ అమానుష ఘటనపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు ఆసుపత్రి పరిపాలన విభాగం సదరు మహిళా ఉద్యోగి పింకీని తక్షణమే సస్పెండ్ (విధుల నుండి తాత్కాలిక తొలగింపు) చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి-1956, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సేవకుల (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనలు-1999 కింద ఆమెపై కఠిన క్రమశిక్షణ చర్యలను ప్రారంభించారు. సస్పెన్షన్ కాలంలో ఆమెను ఆసుపత్రిలోని ఆయుష్ అవుట్‌పేషెంట్ విభాగానికి బదిలీ చేశారు.సమగ్ర విచారణకు కమిటీఈ ఘటనపై నిర్ణీత కాలపరిమితిలోగా నివేదిక సమర్పించేందుకు ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పుష్పేంద్ర కుమార్ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ డాక్టర్ దినేష్ ప్రతాప్ సరోజ్, మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ రిచా, సిస్టర్-మేట్రన్ సుష్మా యాదవ్‌లు ఉన్నారు. కాగా, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య