
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Chikkaballapur Homestay Surabhi Death: కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఒక హోమ్ స్టేలో యువతి మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. మృతురాలిని సాయి సురభి (26)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, ఆమె ప్రియుడు మహమ్మద్ సంజిత్ అలీ ఆమెను హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సురభి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా తన కూతురిని అతను వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. సురభి మృతదేహం వద్ద అతడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్న పరిస్థితిలో ఉండటంతో, పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, సాయి సురభి కర్ణాటకలోని అడియార్ జిల్లాకు చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందినది. క్యాబ్ బుక్ చేసుకుంటున్న సమయంలో కేరళకు చెందిన మహమ్మద్ సంజిత్ అలీ ఆమెకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత వీరు బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ ప్రాంతంలో కలిసి ఉంటున్నారు. అయితే సంజిత్ అలీ తన కూతురికి మద్యం, మత్తు పదార్థాలు అలవాటు చేశాడని సురభి కుటుంబం ఆరోపిస్తోంది.
26 ఏళ్ల సురభి బెంగళూరుకు చెందిన ఫిజియోథెరపిస్ట్. తన కూతురిది కచ్చితంగా లవ్ జిహాదే అని మృతురాలి తల్లి ఆరోపించారు. 'నా కూతురు ఎక్కడికి వెళ్లినా అతను వెంటాడి వేధించేవాడు. అతను నన్ను చంపేస్తాడని, వేరే పెళ్లి చేసి నన్ను దూరం చేయాలని పదే పదే భయపడుతూ చెప్పేదని సురభి తల్లి కన్నీరుమున్నీరయింది. ఇంతలోనే తనకు తెలియకుండా , ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తన కుమార్తెను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడని ఆమె వివరించారు. అంతేకాకుండా, సంజిత్ అలీపై ఇప్పటికే పలు నేరారోపణలు ఉన్నాయన్నారు
ముందే పోలీసుల రక్షణ కోరినప్పటికీ, నిందితుడు తన కూతురిని వేధించి, మోసం చేసి చివరికి ప్రాణాలు తీశాడని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అలీ కోలుకున్న తర్వాత ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా కేసులో కీలక వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. సురభి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఈ జంట గతంలో పారిపోయి వివాహం చేసుకున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, వీరిద్దరూ గత మూడు రోజులుగా హోమ్ స్టేలో ఉంటున్నారు. పరిశీలనలో అక్కడ ఒక తాడు, కొన్ని రకాల టాబ్లెట్లు, వాంతు చేసి, పక్కనే ఒక పిల్లో కూడా దొరికింది. అయితే సురభి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఇది హత్యతో కూడిన ఆత్మహత్యనా లేక మరేదైనా కారణమా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ లవ్ జిహాద్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో హిందూ నాయకుడు తేజ గౌడ కూడా బాధితులకు సానుభూతి తెలియజేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.