కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కనుపాపని చిదిమేశాడు. కన్నకూతురు అని కూడా చూడకుండా 13 ఏళ్ల బాలికను నోట్లో గుడ్డలు కుక్కి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారు
ణాన్ని కళ్లారా చూసిన భార్య దిగ్భ్రాంతికి గురై నిశ్చేష్టురాలైంది. ఈ అమానుష ఘటన గుజరాత్లోని వడోదర జిల్లాలో చోటుచేసుకుంది. భార్య ఇంట్లో లేని సమయంలో సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. ఎక్కడ అరుస్తుందోనన్న భయంతో నోట్లో గుడ్డలు కుక్కి మరీ అత్యాచారం చేశాడు. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన భార్య ఈ ఘోర ఘటన చూసి ఏం చేయాలో తెలియక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల మేరకు.. వడోదర జిల్లాలోని దేశర్ తాలూకాలోని ఓ గ్రామంలో భార్యభర్తల గొడవలు వచ్చాయి. దాంతో భార్య సమీపంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో 13 ఏళ్ల కూతురు, 10 ఏళ్ల కొడుకు ఉన్నారు. పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉండటంతో తన సోదరిని తీసుకుని ఇంటికి వచ్చింది భార్య. ఇంట్లో తలుపు తెరిచి చూసే సమయానికి కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. భార్య, ఆమె సోదరిని చూసిన వెంటనే అతను అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య వెంటనే ఆ బాలిక దగ్గరికి వెళ్లి నోట్లో ఉన్న గుడ్డలు తీసేసి ఆమెను హత్తుకుంది. జరిగిన విషయం మొత్తం బాలిక తన తల్లికి చెప్పడంతో ఇద్దరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. కన్న కూతురు అన్న స్పృహ కూడా లేకుండా పాశవికంగా ప్రవర్తించిన ఆ తండ్రిపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ్ముడు నిద్రపోయిన తర్వాత, తండ్రి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. అరవకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కాడంటూ చెప్పింది. దాంతో స్థానిక దేశర్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన భార్య తన భర్తపై ఫిర్యాదు చేసింది. బాధితుల వివరాల మేరకు ఫిర్యాదు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.