
నిత్యం పెరుగుతున్న ధరలతో అల్లాడిపోతున్న దేశంలోని వాహనదారులకు ప్రైవేట్ రంగ చమురు దిగ్గజం నయారా ఎనర్జీ (Nayara Energy) అదిరిపోయే ఊరటనిచ్చింది.
దేశవ్యాప్తంగా తమ రీటైల్ నెట్‌వర్క్‌లో పెట్రోల్ ధరను లీటరుకు ఏకంగా రూ. 5, డీజిల్ ధరను లీటరుకు రూ. 3 మేర తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. గత రెండేళ్ల కాలంలో దేశంలో ఇంధన ధరలను తగ్గించిన మొదటి చమురు సంస్థగా నయారా నిలిచింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు సడలడంతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు గణనీయంగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం.దేశవ్యాప్తంగా ఉన్న నయారా ఎనర్జీకి చెందిన 7,000 కంటే ఎక్కువ పెట్రోల్ బంకులలో ఈ సవరించిన నూతన ధరలు జూలై 1, 2026 నుంచు తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే వాహనదారులకు లభించే అంతిమ రీటైల్ విక్రయ ధరలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నులు, వ్యాట్ (VAT) రేట్ల ఆధారంగా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి.ధరల తగ్గుదలకు కారణం ఇదే!గత కొన్ని వారాలుగా పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పూర్తిగా సడలడం, కీలకమైన సముద్ర రవాణా మార్గాలలో ప్రయాణం తిరిగి ప్రారంభం కావడంతో గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు సరఫరా మెరుగైంది. గతంలో ఇరాన్ వివాదం కారణంగా చమురు ధరలు పెరగడంతో, మార్చి 26న నయారా ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో నయారా సంస్థ ఆ పెంచిన ధరలను పూర్తిగా రద్దు చేసినట్లు అయింది. కాగా, గుజరాత్‌లోని వాడినార్‌లో ఉన్న 20 మిలియన్ టన్నుల సామర్థ్యం గల పెద్ద రిఫైనరీ పనులను విరామం తర్వాత నయారా ఎనర్జీ విజయవంతంగా పునఃప్రారంభించింది. ప్రస్తుతం ఇది దేశీయ ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం-జూలై 1 నుంచి ఇలా..!ప్రభుత్వ సంస్థల బంకుల్లో పరిస్థితి ఏంటి?ప్రైవేట్ సంస్థ నయారా ఎనర్జీ ధరలను తగ్గించినప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) మాత్రం తమ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశంలోని 90 శాతానికి పైగా బంకులు ప్రభుత్వ ఆధీనంలోనే చమురు విక్రయాలు జరుపుతున్నాయి. ఉదాహరణకు న్యూఢిల్లీలో ఐఓసీ బంకుల్లో పెట్రోల్ లీటరుకు రూ. 102.12, డీజిల్ రూ. 95.20 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు..? కేంద్ర మంత్రి కామెంట్స్వాహనదారుల ఆశలు..ప్రైవేట్ సంస్థ నయారా ఎనర్జీ చూపిన ఈ మార్గంలోనే, రాబోయే రోజుల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఇతర చమురు సంస్థలు (IOC, BPCL, HPCL) కూడా ధరలను తగ్గిస్తాయేమోనని సామాన్య వాహనదారులు ఎంతగానో ఆశిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ సంస్థలు కూడా ఇదే బాట పడితే దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత దిగిరావడం ఖాయం!