
మీకు బ్రాండెడ్ దుస్తులు అంటే ఇష్టమా? ప్రపంచంలో మీలాగే ఎంతోమందికి ఇష్టం.. కానీ బ్రాండెడ్ దుస్తుల స్మశానం ఒకటుంది. ఇక్కడ కోట్ల విలువైన బ్రాండెడ్ దుస్తులను చెత్తలా తీసుకొచ్చి పడేస్తారు.
ఇప్పుడు ఆ చెత్త ఎంతగా పెరిగిపోయిందంటే అంతరిక్షం నుండి కూడా కనిపించేతగా. అందుకే దీన్ని బ్రాండెడ్ దుస్తుల స్మశానం అని పిలుస్తున్నాు.ఇది చిలీలోని అటకామా అనే ఎడారిలో ఉంది. ఇక్కడ జీవులు ఏవి బతకలేవు. ఎవరూ నివసించరు కూడా. కానీ బ్రాండెడ్ బట్టలు మాత్రం కుప్పలుగా కొండల్లా పేరుకుపోయి కనిపిస్తాయి. పోనీ వీటిని ఎవరైనా ధరించారా? అంటే అదీ కాదు. అన్ని సరికొత్తవే.
కొత్త బ్రాంండెడ్ దుస్తులను అటకామా ఎడారికి తీసుకొచ్చి ఎవరు పడేస్తున్నారు? అనే సందేహం వస్తుందా? ఎవరో కాదు ఆ బ్రాండెడ్ దుస్తులను తయారుచేసే కంపెనీ వారే. ప్రతి ఏడాది 59,000 టన్నుల కొత్త బట్టలను ఇక్కడికి తీసుకువస్తారు. నిజానికి వీటిలో 85 శాతం బట్టలు కనీసం మార్కెట్లోకి అమ్మకానికి కూడా వెళ్లనివే. వాటిని నేరుగా ఈ ఎడారికే తీసుకొస్తారు. ఆ బట్టల్లో 80 శాతానికి పైగా ఇక్కడే వదిలేస్తారు. అందుకే ఈ కుప్పలు పెద్దవిగా పెరిగిపోయి అంతరిక్షం నుండి కూడా కనిపించేలా మారాయి. ఎడారిలో విపరీతమైన వేడి ఉంటుంది. పొడి వాతావరణం ఉంటుంది. దీనివల్ల దుస్తులకు అప్పుడప్పుడు మంటలు అంటుకుంటాయి. ఇవి కాలి బూడిద అయిపోతూ ఉంటాయి.
ప్రపంచంలో ఎంతోమందికి కనీసం వేసుకోవడానికి సరిగా దుస్తులు లేవు. కానీ ఇక్కడ మాత్రం ఇన్ని వేల కోట్ల రూపాయల దుస్తులను వృధాగా పడేస్తున్నారు. ఇలా బ్రాండెడ్ దుస్తులను ఆయా కంపెనీలు ఎందుకిలా పడేస్తున్నారో తెలుసా? ప్రతి సీజన్లో కొత్త డిజైన్లను బ్రాండెడ్ కంపెనీలు తీసుకువస్తాయి. అందుకే పాత, అమ్ముడుపోని వాటిని ఇలా పారేస్తూ ఉంటారు. అంతే తప్ప అవసరం లేని వారికి, ఎన్జీవోకు, ఛారిటీ సంస్థల కోసం ఇచ్చి పేదవారికి పంచాలనే ఆలోచన మాత్రం వారికి రావడం లేదు. ఎడారిలో పడేయడం వల్ల అక్కడ నేల కూడా విపరీతంగా కలుషితమైపోతోంది. అక్కడ మట్టిని పాడవుతోంది. అలాగే వాతావరణం మార్పులకు కారణం అవుతాయి. ఈ దుస్తులను ఇలా పడేయడం కన్నా అవసరమైన వారికి పంపిణీ చేస్తే ఇలాంటి సమస్య రాదు. కానీ ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు కూడా.