
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్థానిక పార్కులో సుమారు ఐదు నెలల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
హైదరాబాద్, జులై 01: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం స్థానిక పార్కులో సుమారు ఐదు నెలల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పార్కు వద్దకు చేరుకుని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
దీనిపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ మృతదేహాన్ని గుర్తు తెలియని మహిళ పార్కులో వదిలి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువు మృతదేహాన్ని చూసి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం
మాటలు రాకపోయినా మాయ చేసింది.. చిన్నారి పాటకు సోషల్ మీడియా ఫుల్ ఫిదా