చిత్తూరు జిల్లాలో స్కూల్ విద్యార్థుల్ని వింత పురుగుల సమస్య వెంటాడింది. కార్వేటినగరం మండలం డీఎంపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల్ని వింత పురుగులు కుట్టాయి. వెంటనే మొత్తం 19మంది
విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం కొంందరు విద్యార్థులు స్కూల్కు వచ్చారు.. అక్కడ చెట్ల కింద ఆడుకుంటున్న సమయంలో వింత పురుగులు పిల్లల ఒండిపై పడ్డాయి. విద్యార్థుల్ని ఆ పురుగులు కుట్టడంతో ఒంటిపై దద్దుర్లతో పాటుగా మంటతో ఇబ్బందిపడ్డారు. తోటి విద్యార్థులు వీరిని తీసుకెళ్లి స్నానం చేయించినా దద్దుర్లు తగ్గలేదు. విద్యార్థులకు ఒంగిపై మంట ఎక్కువ కావడంతో పెద్దగా కేకలు వేశారు. వెంటనే టీచర్లు విద్యార్థుల్ని స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనాల్లో 19మందిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ స్కూల్ సమీపంలో మామిడి తోటలు ఉన్నాయి.. అక్కడ మామిడి కాయలు కుళ్లిపోయి రాలిపోయి ఉన్నాయి. ఆ కాయలలో నుంచి వింత పురుగులు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఆర్డీవో అనుపమ, ఎంఈవోవోలు పుత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.. విద్యార్థులకు వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. ఆస్పత్రిలో చేరిన ఐదుగురు విద్యార్థులకు వాంతులయ్యాయి. ఈ విషయం ఊరిలో జనంకు తెలియడంతో అందరూ స్కూల్ దగ్గరకు వచ్చారు.. మిగిలిన పిల్లల్ని ఇళ్లకు పంపించమని ఆందోళన చేశారు. దీంతో స్కూల్కు సెలవు ప్రకటించి విద్యార్థుల్ని ఇంటికి పంపించారు. స్కూల్ దగ్గర పురుగులు ఉన్నాయని అనుమానిస్తున్న చెట్టు కొమ్మను కొట్టించారు. అయితే విద్యార్థులు కోలుకోవడంతో మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. 19 మంది విద్యార్థులకు ఎలాంటి సమస్య లేదని.. ఎందువల్ల జరిగిందో కచ్చితంగా తెలియడం లేదని డాక్టర్లు అంటున్నారు. మొత్తం మీద వింత పురుగుల దెబ్బకు విద్యార్థులు అల్లాడిపోయారు.. స్కూల్కు సెలవు ప్రకటించారు. కొద్దిరోజులుగా ఉభయ గోదావరి జిల్లాలో యాసిడ్ పురుగులు జనాల్ని వణికిస్తున్నాయి. అవి ఒంటిపై పాకితే దద్దుర్లు, మంటతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇక్కడ కూడా విద్యార్థుల్ని వింత పురుగుల సమస్య వెంటాడుతోంది.