
చిన్న పిల్లలు భగవంతుని ప్రతిరూపాలు. వారికి కల్లాకపటం తెలియదు. ముద్దు ముద్దుగా ఉండే వారు ఏం చేసినా వారిని అందరూ ఇష్టపడతారు. నడవడం కూడా సరిగ్గా రాని వారు డ్యాన్స్ చేస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: చిన్న పిల్లలు భగవంతుని ప్రతిరూపాలు. వారికి కల్లాకపటం తెలియదు. ముద్దు ముద్దుగా ఉండే వారు ఏం చేసినా వారిని అందరూ ఇష్టపడతారు. నడవడం కూడా సరిగ్గా రాని వారు డ్యాన్స్ చేస్తారు. వచ్చి రాని మాటలతో వారు ముద్దుముద్దుగా పాటలు పాడతారు. అవి అందరిని ఆకట్టుకుంటాయి. అవి కూడా కొత్త ట్యూన్లో కట్టిన పాటలాగా ఉంటాయి. చిన్న పిల్లల అల్లరి చేష్టలు, అమాయకపు చిలిపి పనుల చూసి అంతా నవ్వుకుంటారు.
అందుకే పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. అలాంటి ఓ చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆ పాప అమాయకపు చేష్టలు, మధురమైన హావభావాలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఎంత ముద్దుగా ఉందంటే.. నెటిజన్లు ఒక్కసారి కాదు.. పదే పదే చూస్తున్నారు. ఈ వీడియోకు చాలా మంది అభిమానులుగా మారిపోతున్నారు.
సదరు వీడియోలో ఓ పాప.. తే తే తు తు తి తి.. అని పాట పాడుతోంది. ఈ సమయంలో ఆమె ముద్దు ముద్దుగా మాట్లాడే గొంతు, ముఖ కవళికలు ఎంతో సరదాగా ఉన్నాయి. అవి కూడా ఎంతగా ఉన్నాయంటే.. ఆ వీడియోను వీక్షిస్తే ఒత్తిడి ఇటే మాయమై పోతుందనేలా ఉన్నాయి. పాట పాడుతున్నప్పుడు ఆ చిన్నారి కళ్లు తిప్పడం ఈ వీడియోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్‌లో భారీగా షేర్ చేశారు.
అంతేకాకుండా లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించి.. లైకులు కొట్టారు. ఇక కామెంట్లలో ఈ చిన్నారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓహ్ వావ్. ఎంత మధురమైన స్వరం అని మెచ్చుకుంటున్నారు. అందమైన హావభావాలు అంటూ ప్రశంసిస్తున్నారు. నా ఈ రోజును ఆనందమయం చేశాయని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఈ చిన్నారి సూపర్ స్టార్ అవుతుందని మరో నెటిజన్ జోస్యం చెప్పారు. ఆ పాటలోని మాధుర్యం నిజంగా సాటిలేనిదని కామెంట్ బాక్లో పేర్కొన్నారు.
మీకు మ్యాంగో జ్యూస్ అంటే ఇష్టమా.. ఈ వీడియో చూస్తే ఇకపై ఎప్పుడూ తాగరేమో..
రైలు కోచ్‌ను చెత్తకుండీగా మార్చిన మహిళ.. వీడియో వైరల్