
Lenin : అఖిల్ అక్కినేని ఎప్పుడు హిట్ కొడతాడా అని అఖిల్ అభిమానులతో పాటు టాలీవుడ్ జనాలు కూడా ఎదురుచూస్తున్నారు. అక్కినేని వారసుడుగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. మొదటి సినిమా అఖిల్ ఫ్లాప్ అయింది.
ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఇక ఏజెంట్ సినిమా అయితే డిజాస్టర్.
దీంతో అఖిల్ ఎప్పుడు హిట్ కొడతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అఖిల్ లాస్ట్ సినిమా వచ్చి మూడేళ్లు దాటింది. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి అఖిల్ కి ఎలాగైనా హిట్ ఇప్పించాలని నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి స్టోరీ, రీ షూట్స్, అవుట్ పుట్ చూసిన తర్వాత మార్పులు, నిర్మాణంలో భాగస్వామి అవ్వడం.. ఇలా అన్ని దగ్గరుండి చూసుకున్నారు. రిలీజ్ డేట్, ట్రైలర్ లో వాయిస్ ఓవర్ కూడా నాగార్జునే ఇవ్వడం గమనార్హం.
నిన్న జూన్ 30న అఖిల్ లెనిన్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో శ్రీరామపురం అనే ఒక ఊరు. ఆ ఊరులో పెద్ద ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, తన అన్న కోసం నిలబడే అఖిల్, ఆ ఊరిలో జరిగే జాతర, తన మరదలితో ప్రేమ, ఆ ఫ్యామిలీకి ఓ విలన్ అంటూ రెగ్యులర్ పంథాలోనే సాగింది. అయితే ట్రైలర్ వచ్చిన దగ్గర్నుంచి రంగస్థలం సినిమాతో కంపేర్ చేస్తున్నారు. కొంత కథ, కథనం, అన్న సెంటిమెంట్ రంగస్థలం లాగే ఉండొచ్చు అని అంటున్నారు నెటిజన్లు.
అంతే కాక ఈ సినిమాలో హీరో అన్నయ్య చనిపోతాడని, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే పాత్ర కూడా అఖిల్ ని పెళ్లి చేసుకున్న తర్వాత చనిపోతుంది. అఖిల్ ఆ కోపంతో రివెంజ్ తీర్చుకుంటాడని ట్రైలర్ చూసినవాళ్లు తమకు వచ్చిన ఆలోచనలతో కథలు అల్లేస్తున్నారు. దీంతో అన్న, భార్యలను చంపినందుకు రివెంజ్ తీర్చుకునే విలేజ్ బ్యాక్ డ్రాప్ రొటీన్ సినిమా అని అంటున్నారు. కథ సంగతి ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే బాగుంటుందని, అఖిల్ నటన మాత్రం అదిరిపోతుంది ట్రైలర్ చుస్తేనే అర్ధమవుతుంది.
Also See : Lenin Trailer : అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ట్రైలర్ వచ్చేసింది.. యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలి..
ఒకే కథతో ఎన్ని సినిమాలు వచ్చినా కథనం బాగుండి పర్ఫార్మెన్స్ లు బాగా చేస్తే హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మరి లెనిన్ సినిమా కూడా కొత్త కథనంతో ప్రేక్షకులను మెప్పించి అఖిల్ కి హిట్ ఇస్తుందా లేక రెగ్యులర్ రొటీన్ రివెంజ్ డ్రామా లాగా మిగిలి మళ్ళీ అఖిల్ హిట్ కోసం ఎదురుచూసేలా చేస్తుందా చూడాలి.