
టాలీవుడ్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రంగా రామ్ చరణ్ నటించిన `పెద్ది` మూవీ నిలిచింది. ఇది తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం `మన శంకర వర ప్రసాద్...
టాలీవుడ్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రంగా రామ్ చరణ్ నటించిన `పెద్ది` మూవీ నిలిచింది. ఇది తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ కలెక్షన్లని దాటేసింది. దీంతో హైయ్యెస్ట్ కలెక్షన్లని రాబట్టిన మూవీగా సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు. అయితే `మన శంకర వర ప్రసాద్ గారు` రీజినల్ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మరి రామ్ చరణ్ నటించిన `పెద్ది` మూవీ ఎంత వసూలు చేసింది? ఇప్పటి వరకు ఎంత వచ్చాయి? సినిమా హిట్టా? ఫట్టా అనేది చూస్తే, షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటి వరకు రూ.337.25కోట్లు వసూలు చేసిందని సాక్నిల్క్ సైట్ వెల్లడించింది. ఇండియాలో దీనికి రూ.284.35కోట్లు, ఓవర్సీస్లో రూ.53కోట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ మూవీకి రూ.సుమారు రూ.160-170కోట్ల షేర్ వచ్చినట్టు సమాచారం.
పెద్ది సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.220కోట్లు రావాలి. ప్రస్తుతం వచ్చిన కలెక్షన్లు చూస్తుంటే దాదాపు రూ.50-60కోట్ల వరకు లోటు కనిపిస్తుంది. ఈ మూవీ థియేట్రికల్‌గా క్లోజ్ అయ్యింది. రోజుకి ముప్పై లక్షలు మాత్రమే వస్తున్నాయి. ఉన్న టార్గెట్‌కి ఈ కలెక్షన్లు సరిపోవు. ఈ వారంతో ఆల్మోస్ట్ థియేటర్ల నుంచి ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. ఓవరాల్‌గా నిర్మాతలకు ఈ మూవీ ద్వారా రూ.50-60కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ మూవీ హిట్ అని చెప్పి చిత్ర బృందం చెబుతుంది. మహా అయితే ఓవర్సీస్, నార్త్, కర్నాటక వంటి ప్లేస్ లో కొంత వరకు నష్టాలను మిగుల్చుతుందని భావించారు. కానీ ఇప్పుడు వాళ్లు చెప్పినదానికంటే ఎక్కువగానే వాస్తవ నష్టాలున్నట్టు చిత్ర వర్గాల నుంచి తెలుస్తోన్న సమాచారం. క్రిటికల్‌గా మంచి ప్రశంసలుందుకుంది ఈ సినిమా. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు అంతా ఫిదా అయ్యారు. జాతీయ అవార్డు స్థాయి నటనగా కీర్తించారు. నిజానికి అదే స్థాయిలో ఇరగదీశాడు చరణ్. కానీ ఆ ప్రభావం కలెక్షన్లలో కనిపించలేదు. క్రిటికల్‌గా ప్రశంసలు దక్కినా, కమర్షియల్‌గా ఈ మూవీ లాస్ ప్రాజెక్ట్ గా నిలవబోతుందని సమాచారం.
రామ్ చరణ్ హీరోగా నటించిన `పెద్ది` సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై ఈ మూవీని వెంకట్ సతీష్ కిలారు నిర్మించారు. సుమారు రూ.350కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే.