
ఉత్తరప్రదేశ్లోని శామ్లీ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆయుష్ మాలిక్ మతమార్పిడి కేసు దర్యాప్తులో యూపీ పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.
ముస్లిం మతంలోకి మారి, ఆ తర్వాత తిరిగి హిందూమతంలోకి వచ్చిన ఆయుష్ మాలిక్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లభించిన ఒక డైరీలోని మొదటి పేజీలో "నేను ఒక మిషన్లో ఉన్నాను – ఆయుష్ మాలిక్" అని రాసి ఉన్న వాక్యం ఇప్పుడు పోలీసుల విచారణలో అత్యంత కీలకంగా మారింది. ఈ మతమార్పిడి వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ సోదాల్లో డైరీతో పాటు ఒక పెద్ద కత్తి, రెండు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మరోవైపు, ఈ మతమార్పిడికి కారణమైనట్లు భావిస్తున్న ఒక మత పెద్ద (మౌల్వీ) ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, ఈ పరిణామాల మధ్యే ఆయుష్ మాలిక్ తాను స్వచ్ఛందంగా తిరిగి హిందూమతంలోకి మారుతున్నట్లు ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో అతడు హిందూ సంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తూ కనిపించాడు. తల్లిదండ్రుల బాధను చూసి, మనస్తాపంతోనే అతడు తిరిగి స్వగృహానికి, స్వమతానికి చేరుకున్నట్లు ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ తెలిపారు. కోట్ల ఆస్తి కోసమే కుట్ర? ఫిజియోథెరపిస్ట్ అయిన చాందిని ఖురేషి, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషి కలిసి తమ కొడుకు మనసు మార్చి తప్పుదోవ పట్టించారని ఆయుష్ తండ్రి