
రాష్ట్రంలో సామాజిక అభివృద్ధి దిశగా హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు కీలక అడుగు వేసింది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్ ) కార్యక్రమం..
భూపాలపల్లి ఆస్పత్రికి ఎంఆర్ఐ యంత్రం, రెండు అంబులెన్స్‌లు
హైదరాబాద్, భూపాలపల్లి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సామాజిక అభివృద్ధి దిశగా హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు కీలక అడుగు వేసింది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్ ) కార్యక్రమం ‘పరివర్తన్’ కింద రాష్ట్రంలో 12 ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏటా 12 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. హెచ్డీఎఫ్సీ చేపట్టిన పలు కార్యక్రమాలను సీఎం రేవంత్ మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి హెచ్డీఎఫ్సీ సీ సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన అధునాతన ఎంఆర్ఐ యంత్రం, రెండు అంబులెన్స్‌లను సీఎం రేవంత్ వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. స్వయం సహాయక మహిళా సంఘాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ విభాగం అధిపతి నుస్రత్ పఠాన్ మాట్లాడుతూ 10 జిల్లాల్లోని 40కి పైగా గ్రామాల్లో పలు కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు.