
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Harish Rao Challenge: 'తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ కాయితం ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి ఉద్యమం గురించి, త్యాగాల గురించి మాట్లాడుతుంటే నవ్విపోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టు ఉంది ఆయన తీరు' అని అసహనం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజల జోష్ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. జడ్చర్లలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు.
'హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ అని పెడుతున్నాడు. అది రైతు ఆశీర్వాద సభ కాదు రైతుల వంచన సభ' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రైతును వంచించుతూనే ఉన్నాడని ఆరోపించారు. 'యాసంగి రైతు బంధు ఎగొట్టి ఇప్పుడు మళ్లీ వానాకాలం రైతుబంధు వేస్తానని మోసం చేస్తున్నాడు. రైతు రుణమాఫీ రూ.2 లక్షలు కాదు కదా రూ.లక్ష లోపు ఉన్నవాళ్లకు కూడా చెయ్యలేదు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నల్గొండలో ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నాడు. ఆ ఒట్టు అనేదానికి ప్రాణం ఉంటే ఈ రేవంత్ రెడ్డి అబద్ధాలకు ఉరేసుకొని ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేది. కనిపించిన దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా దేవుళ్లనే మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. 'పాలమూరు బిడ్డలు స్వచ్ఛమైన పాలలాంటి మనుసున్న బిడ్డలు. రేవంత్ రెడ్డి జూట మాటలు, బట్టెబాజ్ మాటలతో పాలమూరు పరువు తీస్తున్నాడు' అని మండిపడ్డారు.
'ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పిన మనిషి రేవంత్ రెడ్డి. హామీ ఇవ్వక పోయినా ప్రజలకు కావాల్సింది అర్ధం చేసుకొని రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్. రైతుబంధు పేరిట రూ.29, 300 కోట్లు రైతులకు రేవంత్ రెడ్డి బాకీపడ్డాడు. జూపల్లి కృష్ణారావు మతి ఉండి మాట్లాడుతాడో మతి లేక మాట్లాడతాడో అర్ధం కాదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే అన్నారు. ఇప్పుడు కేవలం 7 ఏడు రకాల వడ్లకే అంటున్నారు' అని గుర్తుచేశారు.
'కేసీఆర్ హయాంలో యూరియా కోసం గోదాములు కట్టించి నిల్వ ఉంచాడు. కానీ రేవంత్ రెడ్డి యాపులు అంటూ నాటకాలు చేస్తున్నాడు. అసెంబ్లీలో తరుగు పెడితే తోలు తీస్తానని రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ తెలంగాణలో ఏ ఊరులో అయినా తరుగు లేకుండా ఒక్క బస్తా కొన్నారా? రేవంత్ రెడ్డి ఎంత మంది తోళ్లు తీశాడు?' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. దళారుల చేతిలో, రైస్ మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ అయ్యాడు తప్ప ఎవరి తోలు తియ్యలేదు అని విమర్శించారు.
'కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి వచ్చాక 6 గంటలకు వచ్చింది. రైతుల కరెంటులో కోత పెట్టడానికే రైతు డిస్కం. సోలార్ పవర్ మాత్రమే రైతు డిస్కంలకు కేటాయిస్తారంట. ఒకవేళ అదే జరిగితే పొద్దున్న 9 నుండి సాయంత్రం 4 వరకే కరెంట్ వస్తది. రైతు డిస్కమ్ అనేది రైతు 24 గంటల కరెంటుకి ఉరితాడు అవుతది' అని రైతులను మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. 'కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా రైతు కుటుంబాలకు ఒక ధీమా లెక్క ఉండే. కానీ కేసీఆర్ పోయాక ఒక 6 నెలల నుంచి రైతు బీమా బంద్ అయ్యింది. ఎల్ఐసీకి బీమా డబ్బులను రేవంత్ రెడ్డి కట్టలేదు. 7,600 రైతు కుటుంబాలు రైతు బీమా కోసం ఎదురుచూస్తున్నాయి' అని రేవంత్ రెడ్డి మోసాలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వివరించారు.