
నేటి రాశి ఫలాలు..ఈరోజు శ్రీపరా భావ నామ సంవత్సరం, జేష్ట మాసం, గ్రీష్మ రుతువు, ఉత్తరాయణం, 2026 జులై 1వ తేదీ బుధవారం. పండితుల ప్రకారం ఈరోజు అదృష్టం కలిసివచ్చే రాశులు ఏవి? ఏ రాశి వారు
అత్యంత జాగ్రత్తగా ఉండాలి? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈరోజు సాదాసీదాగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇబ్బందులు పడకుండా చూసుకోండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి, దూర ప్రయాణాలు మానుకోండి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
వృషభ రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది.
వృశ్చిక రాశి వారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఒత్తిడికి గురవ్వకుండా పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి, తద్వారా విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇతరుల గొడవల్లో పడకండి. ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉంది.
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసి రావడం వల్ల కీలక నిర్ణయాలు తీసుకోగలరు. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని గడుపుతారు. సమాజంలో మంచి ప్రశంసలు, గౌరవం లభిస్తాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా ఈరోజు కలిసివచ్చే రోజు.
కుంభ రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు కూడా కలిసివచ్చే రోజు. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుంభ రాశి వారు ఈరోజు ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది.
మీన రాశి వారికి ఈరోజు అన్ని విధాలా శుభకరం, కలిసివచ్చే రోజు. మీరు ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వింటారు. పెద్దల సూచనల మేరకు నడుచుకుంటారు. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)