
ఈ సినిమాకు ముందుగా నయనతార హీరోయిన్గా అనుకోగా కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం లేదా మరేదైనా కారణం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో బాలయ్య, కాజల్ కలిసి 'భగవంత్ కేసరి' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మరియు నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుండటం నందమూరి అభిమానులకు ఒక తీపి కబురు అనే చెప్పాలి. నిజానికి ఈ సినిమాలో కాజల్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. బాలయ్య మార్క్ డైలాగులకు తోడు, కాజల్ గ్లామర్ మరియు యాక్టింగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. దర్శకుడు బాబీ గతేడాది 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు బాలయ్యను మరింత ఊరమాస్ లుక్‌లో చూపించడానికి పక్కా ప్లాన్ చేశారు.
మరిన్ని వెబ్ స్టోరీస్ ప్రపంచంలోనే అత్యధికంగా తినే పండు ఏదో తెలుసా? రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా? ముద్దబంతి పువ్వులా శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్