
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ స్థానాలను మార్చుకునే సమయాల్లో కొన్ని రాశుల వారికి ప్రత్యేక శుభ ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక ముఖ్యమైన యోగం త్వరలో ఏర్పడనుంది.
జూలై 14న గురుగ్రహం అస్తమయం చెందనుంది. సూర్యునికి చాలా దగ్గరగా వచ్చి అస్తమించడం వల్ల ఇది రజో యోగంగా ఏర్పడుతుంది. ఈ యోగం మేషం, మకరం, తుల రాశుల వారికి ఆర్థికంగా, వ్యక్తిగతంగా మంచి ఫలితాలను అందించనుంది.అస్తమయ స్థితిలో గురువు.. రజో యోగంగురుగ్రహం జూలై 14 నుంచి ఆగస్టు 12 వరకు అస్తమయ స్థితిలో ఉండనుంది. దీంతో రజో యోగం ఏర్పడుతుంది. ఈ కాలంలో ఆర్థిక లాభాలు, ఆలస్యమైన పనులు పూర్తి కావడం, కుటుంబ సంతోషం వంటి శుభ సంఘటనలు జరగవచ్చు. ఈ మూడు రాశుల వారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.మేష రాశిమేష రాశి వారికి ఈ రజో యోగం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగి డబుల్ లాభాలు వస్తాయి. వివాహం, ఉద్యోగం, వ్యాపార విస్తరణ వంటి ముఖ్యమైన పనులు సాఫీగా ముగుస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యం మెరుగుపడి మానసిక శాంతి లభిస్తుంది.మకర రాశిమకర రాశి వారి కోసం ఈ యోగం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మహిళలు ప్రత్యేక లాభాలు పొందవచ్చు. ఆర్థిక స్థితి బలపడి ఆనందకరమైన రోజులు వస్తాయి.జూలై 2న రేవతి నక్షత్రంలోకి శని.. ఈ రాశులవారికి హెచ్చరిక!తుల రాశితుల రాశి వారికి ఈ కాలం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా శుభకరంగా ఉంటుంది. ఆలస్యమైన కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ముగుస్తాయి. విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత పనులు చేపట్టాలనుకునేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషం, ఆనందం నెలకొంటాయి.గమనిక: ఇవి జ్యోతిష్య సంప్రదాయాల ప్రకారం చెప్పబడినవి. వ్యక్తిగత ఫలితాలు వ్యక్తి జాతకం, కర్మలపై ఆధారపడి ఉంటాయి.