
అహ్మదాబాద్: ‘హిందూ సంప్రదాయంలో వివాహం చాలా పవిత్రమైనది. జీవితాంతం కొనసాగే బంధం. ఓ పురుషుడు ఓ మహిళ పరస్పర గౌరవం, సమానత్వ భావనతో ఒక్కటయ్యే ఆధ్యాత్మిక వేడుక. మూడు ముళ్లువేసి..
ఏడడుగులు కలిసి నడవటం వంటి క్రతువులన్నీ పాటిస్తేనే హిందూ వివాహ చట్టం ప్రకారం ఆ జంటకు పెళ్లయినట్లు. కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతులను అనుసరించడంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కానీ, క్రతువులేవీ లేకుండా కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే హిందూ సంప్రదాయంలో ఆ వివాహం చెల్లదు’ అని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది.
నకిలీ ధ్రువపత్రంతో పెళ్లియినట్లుగా చెబుతున్న వివాహం చెల్లదని ప్రకటించాలన్న అభ్యర్థనను కుటుంబ న్యాయస్థానం తిరస్కరించడంతో బ్రిటన్ నివాసి హైకోర్టును ఆశ్రయించారు. మ్యారేజి సర్టిఫికేట్ను సమర్పించిన మహిళ...తమకు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహ క్రతువులు జరగలేదన్న విషయాన్ని కుటుంబ న్యాయస్థానంలో అంగీకరించింది. అయినప్పటికీ ఆ వివాహాన్ని రద్దు చేయటానికి కుటుంబ న్యాయస్థానం సమ్మతించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. యువకుడి పిటిషన్ను అనుమతిస్తూ వివాహం చెల్లదని ప్రకటించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.